yeSBee Opinion Pawan Kalyan.. ఓ సినీ నటుడు.! అభిమానుల్ని కొడతాడనే ఘన కీర్తి కలిగినోడు.! ‘మెంటల్ సర్టిఫికెట్’ కూడా పొందాడు.! కానీ, అతన్ని రాజకీయ నాయకుడిగా ఓటర్లు ఆమోదించారు.!
ఇంకో రాజకీయ ప్రముఖుడు.. అక్రమాస్తుల కేసులో ఏకంగా 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. బాబాయ్ దారుణ హత్యకు గురైతే, గుండె పోటు.. అని నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ, ఇతన్ని కూడా జనం రాజకీయ నాయకుడిగా ఆమోదించారు.
పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన ఘనుడాయన.! అతనూ రాజకీయ నాయకుడిగా ప్రజామోదం పొందాడు.!
కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడిగా ప్రజామోదం పొందలేకపోతున్నాడు.! ఎందుకు.?
yeSBee Opinion Pawan Kalyan తప్పు ఎక్కడ జరుగుతోంది.?
ఎవర్నీ పవన్ కళ్యాణ్ మోసం చేయలేదు. ‘మెంటల్ సర్టిఫికెట్’ పవన్ కళ్యాణ్‌కి లేదు. అక్రమాస్తుల కేసులేవీ పవన్ కళ్యాణ్ మీద లేవు.

బహుశా.. ఇదే కారణం అయి వుండొచ్చు.. పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan), రాజకీయ నాయకుడిగా ప్రజామోదం పొందకపోవడానికి.!
అంతేనా.? అంతే మరి.! ఇంతకన్నా బలమైన కారణం ఇంకేముంటుంది.?
అభిమానులు ఏం చేస్తున్నారు.?
అసలు, పవన్ కళ్యాణ్ అభిమానుల బాధ్యతేంటి.? ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్‌నే ప్రశ్నిస్తున్నారు.
పైన పేర్కొన్న మూడు కేసుల్లో ఏ రాజకీయ నాయకుడ్నీ ఎవరూ ప్రశ్నించరు. చిత్రంగా పవన్ కళ్యాణ్‌ని ఆయన అభిమానులే ప్రశ్నించేస్తుంటారు. అదే అసలు సమస్య.

‘నా స్నేహితుడొకడు నాకు ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్‌ని నానా తిట్లూ తిడుతున్నాడు.. నేను అవమాన భారంతో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. నిన్ను నమ్మడమే నేను చేసిన నేరమా.?’ అని ప్రశ్నిస్తున్నాడో పవన్ అభిమాని, సోషల్ మీడియా వేదికగా.
అసలు, అతను పవన్ కళ్యాణ్ అభిమానే కాదు.! అభిమానం అంటే ఎలా వుంటుందో తెలుసా.? పైన పేర్కొన్న మూడు సందర్భాల్లోనూ ఆయా వ్యక్తుల్ని రాజకీయ నాయకులుగా ఆమోదించిన ప్రజలున్నారే.. వాళ్ళని అభిమానిస్తున్న అభిమానులున్నారే.. అలా వుంటుంది.
Also Read: ది గ్రేట్ గాసిప్! రేయ్ యెంకటీ! నీ ‘రెడ్’ లైట్ కుంపటి కథేంటి?
మాయమటలు చెప్పి, చట్ట సభల్లో అడుగు పెట్టాలనుకోవడం… వందల కోట్లు వేల కోట్లు గుమ్మరించి అధికారం చేపట్టాలనుకోవడం.. ఇవేవీ పవన్ కళ్యాణ్ చేయడంలేదు.
ఇవన్నీ అవమానకరమైన విషయాలా.? ముందు సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అభిమానుల మైండ్ సెట్ మారాలి.! అప్పుడే, మంచి నాయకుడ్ని రాజకీయాల్లో చూడగలుగుతాం.

నిజానికి, నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని ఎవడూ, ఆయన్ని ప్రశ్నించలేడు. ఎలా ప్రశ్నిస్తాడు.? నువ్వు అభిమానిస్తున్నానని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్, నీకంటే చాలా చాలా నిజాయితీపరుడు.!
Note: పవన్ కళ్యాణ్‌కి లక్షలాది మంది అభిమానులున్నారు.! వాళ్ళే ఆయనకి సైన్యం. ఆయనే వాళ్ళకు సేనాని.! కానీ, ఒకరిద్దరు ‘మేతావుల’ వల్ల, ప్రత్యర్థులకు తేలిగ్గా పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు టార్గెట్ అయిపోతున్నారు.