Table of Contents
ఆంజనేయుడు చిరంజీవి. ఆయనే హిమాలయాల్లో (Yeti Snow Man Himalayas) ఇప్పటికీ తిరుగుతుంటాడనీ, ఓ బలమైన నమ్మకం. ఆంజనేయుడి అంశే జాంబవంతుడనీ, ఆ జాంబవంతుడే ‘యతి’ రూపంలో హిమాలయాల్లో సంచరిస్తుంటాడనీ, అంటుంటారు.
అయితే ‘యతి’ అన్న ప్రస్థావనే అనవసరమనీ, అదంతా అభూత కల్పన అనీ ఇంకొన్ని వాదనలున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, హిమాలయాల్లో అప్పుడప్పుడూ యతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఈనాటి కథ కాదు.
యతి.. అసలు కథ ఏంటంటే..
ఒకటో శతాబ్ధంలో ‘యతి’ని గుర్తించినట్లు రోమన్ చరిత్ర కారుడు తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నాడు. ‘వనజీవి’గా యతిని అభివర్ణించాడు ఆ చరిత్రకారుడు. తర్వాత చాలా కాలం వరకూ యతి ప్రస్థావన అధికారికంగా జరిగిన దాఖలాల్లేవు.
అయితే, 1832లో యతి గురించిన చర్చ ప్రపంచమంతా జరిగింది. యతి హిమాలయాల్లో ఉందనీ, ఓ పుస్తకంలో ప్రస్థావించారు. మళ్లీ 1899లో ‘అమాంగ్ ద హిమాలయన్స్’ అనే పుస్తకంలో యతి అడుగుజాడల గురించి సవివరంగా పేర్కొన్నారు. అయినప్పటికీ యతిపై స్పష్టత లేదు.
ఓ ముప్పైయేళ్ల తర్వాత యతి (Yeti Snow Man Himalayas) రూపం గురించి ఓ గ్రీకు ఫోటో గ్రాఫర్ సవివరంగా వెల్లడించారు. తాను యతిని చూశాననీ, దురదృష్టవశాత్తూ ఫోటో తీయలేకపోయాననీ ఆయన చెప్పారు. అలా యతి పట్ల ఆశక్తి 20 వ శతాబ్ధంలో ఊపందుకుంది.
యతి ఉందా.? లేదా.? అనే ప్రశ్నకు సమాధానం కోసం చరిత్రకారులందరూ నడుం బిగించారు.
ఈ క్రమంలో చాలా మందికి యతి జాడ తెలిసింది. కానీ, కెమెరాల్లో బంధించడానికి ఎవరికీ వీలు కాలేదు. కేవలం యతి అడుగు జాడలు మాత్రమే దొరికాయి వాళ్లకి. అచ్చం మనిషిని పోలే కాళ్లు యతికి ఉన్నాయి. కానీ, ఆ పాదాలు చాలా పెద్దవి. మనిషి కూడా చాలా పెద్దగా కనిపించాడు.
మనిషీ కాదు, జంతువూ కాదు! (Yeti Snow Man Himalayas)
మనిషి అంటే మనిషీ కాదు, అలాగనీ జంతువూ కాదు.. అదో పెద్ద రూపం. అయితే మనిషి పోలికలే ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇంతవరకూ యతి ఎవరి మీదా దాడి చేయలేదు. దాడి చేయలేదు కాబట్టి, అసలు ఆ యతి అన్నదే భ్రమ.. అంటారు కొందరు.
ఎవరి వాదనలు వారివి. వాదనల సంగతి పక్కన పెడితే, యతిని ప్రత్యక్షంగా చూసిన వారు మాత్రం ఆ రూపాన్ని తాము కన్ను మూసే వరకూ మర్చిపోలేదు. ఎంతమంది చూసినా, అందరికీ ఒకే రూపం కనిపించింది. దానర్ధం యతి కల్పన కాదు. నిజం.
Also Read: తగ్గాడు.. నెగ్గాడు.! అందుకే, చిరంజీవి అందరివాడు.!
కొన్ని నిజాలు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటాయి. అన్నింటికీ ఆధారాలు కావాలంటే, కొన్నిసార్లు చూపించలేం. ప్రాణం ఎలా ఉంటుంది.? నొప్పి ఎలా ఉంటుంది.? ఆనందం ఎలా ఉంటుంది.? వాటి రూపాలేంటీ.? అని అడిగితే కొంతమంది పిచ్చోళ్లంటారు.
కానీ, అన్ని వేళలా తర్కం పనికి రాదు. మనిషి మేధస్సుకు అందనివి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. బహుశా అందులో యతి (Yeti Snow Man) కూడా ఒకటి కావచ్చేమో.!
ఇప్పుడీ యతి చర్చ ఎందుకు?
అసలు ఇప్పుడీ యతి చర్చ ఎందుకంటే, ఇండియన్ ఆర్మీ ఈ యతి అడుగు జాడల్ని కనుగొంది. ఈసారి కూడా ఇదివరకట్లానే ప్రపంచం ఉలిక్కి పడింది. యతి కోసం వెతుకులాట మళ్లీ మొదలైంది.
వేల ఏళ్ల నాటి ఆదిమ తెగకు సంబంధించిన మనుషులే యతిలా (Yeti Snow Man) కనిపిస్తున్నారేమో అని కొందరు అభిప్రాయపడొచ్చు గాక. కానీ, ప్రస్తుత సాంకేతిక ప్రపంచం మనిషి జాడను గుర్తించలేని అధమ స్థాయిలో ఉందని ఎలా అనుకోగలం.?
సో యతి మనిషి కాదు. కానీ మనిషిలాంటి ఓ అర్ధం కాని ప్రశ్న. కానీ యతి నిజం. ఈ మిస్టరీ వీడేదెప్పుడు.?