తొలిసారిగా బుల్లితెరపై వ్యాఖ్యాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించింది ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu) రియాల్టీ షో ద్వారానే. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత బుల్లితెరపై వ్యాఖ్యాతగా (Young Tiger NTR Evaru Meelo Koteeswarulu) కనిపించబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (Evaru Meelo Koteeswarulu) అనే ప్రశ్నని సంధిస్తూ.
మొత్తం నాలుగు సీజన్లు నడిచాయి ఇప్పటిదాకా బిగ్ బాస్ రియాల్టీ షోకి సంబంధించి. అందులో రెండు సీజన్లకు కింగ్ అక్కనేని నాగార్జున (King Akkineni Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తే, మరో సీజన్‌కి నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హోస్ట్‌గా పనిచేసిన విషయం విదితమే. నాని, నాగార్జున.. తమదైన స్టయిల్లో ‘షో’ చేశారుగానీ, ఎన్టీఆర్ హోస్టింగ్ సమ్‌థింగ్ స్పెషల్.
బిగ్ బాస్ రియాల్టీ షోతో పోల్చితే, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఇంకా స్పెషల్. ఇది కూడా ఓ గేమ్ షో. ఇందులోనూ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆస్కారముంటుంది. బిగ్‌బాస్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు (Jr NTR Evaru Meelo Koteeswarulu) షోని పోల్చలేం. అది వేరే, ఇది వేరే. అయినాగానీ, అక్కడున్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్.
గతంలో ఇదే షో, నాగార్జునతోపాటు (Akkineni Nagarjuna), మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) వ్యాఖ్యాతలుగా నడిచింది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ (Meelo Evaru Koteeswarudu) పేరుతో. అప్పట్లో ఆ షో సూపర్ హిట్. అంతకు మించి ఇప్పుడు.. సరికొత్త రీతిలో బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో, బోల్డన్ని ఎమోషన్స్‌తో కాస్త పేరు మార్చుకుని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ ముందుకు రాబోతోంది.
Also Read: ఎన్టీయార్.. టీడీపీ కోసం రా.. కదలి రా.!
బుల్లితెర అంటే చాలా ప్రత్యేకమైనదనీ, ప్రతి ఇంటికీ చేరువయ్యే బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించడం ఓ సాహసమని గతంలో చెప్పిన యంగ్ టైగర్ (Young Tiger NTR Evaru Meelo Koteeswarulu), గతంలో కంటే ఇంకాస్త ఎక్కువ ప్రతిష్టాత్మకంగా ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోని డీల్ చెయ్యబోతున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని హోస్ట్‌గా ఎంచుకోవడంతోనే నిర్వాహకులు ‘అదుర్స్’ అనిపించేశారు. యంగ్ టైగర్ వ్యాఖ్యాతగా ఈ షో బంపర్ హిట్ అవుతుందని, బుల్లితెర రేటింగుల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తుందనీ సగటు బుల్లితెర వీక్షకుడు ఆల్రెడీ ఫిక్సయిపోయాడు.