Young Tiger NTR Fans.. రాజకీయ నాయకులకు మించిన స్థాయిలో సినీ జనాలు కొందరు ‘పొలిటికల్ డైలాగుల్ని’ సినీ వేదికలపై వల్లించేస్తుంటారు.
ఆ హీరో ఈ హీరో అన్న తేడాల్లేవ్.! అభిమానులే దేవుళ్ళంటారు.. ఇంకోటేవో చెబుతుంటారు.
చాలా సందర్భాల్లో వుంటుంటాం.. ఓటరు దేవుళ్ళని రాజకీయ నాయకులు అనడాన్ని. సినీ జనాలేమో, ప్రేక్షక దేవుళ్ళంటారు. అంతే తేడా.! మిగతాదంతా సేమ్ టు సేమ్ అనొచ్చా.?
యంగ్ టైగర్ ఎన్టీయార్ తాజాగా, ‘నాకుగానీ, కళ్యాణ్ అన్నకి (కళ్యాణ్‌రామ్) గానీ ఆస్తిపాస్తులొద్దు.. మీ అభిమానం వుంటే చాలు..’ అనేశాడు.
కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రాసిచ్చెయ్ మరి.!
సరే, ఆస్తిపాస్తులు వద్దంటున్నాడు కదా, అభిమానులే కావాలంటున్నాడు కదా.! ఆస్తిపాస్తులన్నిటినీ అభిమానులకు రాసిచ్చేస్తే పోలా.? అన్నది నెటిజనం సంధిస్తోన్న ప్రశ్న.

ఏదో, అభిమానుల్ని ఉత్సాహ పరిచేందుకు.. వాళ్ళని మునగ చెట్టు ఎక్కించేయడం హీరోలకి అలవాటే. అచ్చం రాజకీయ నాయకుల్లానే తయారయ్యారు సినీ ప్రముఖులు కూడా.
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందంటారు. సినీ జనాలు ముదిరితే రాజకీయ నాయకులవుతారనాలో.. రాజకీయం వంట బట్టించుకున్న సినీ జనాలే ఇలా మారతారని అనాలో అర్థం కాని పరిస్థితి.
జస్ట్ సరదాకి.! సరదాగా తీస్కోండి.. ఎవరూ, తమ ఆస్తుల్ని ఇంకొకరికి రాసిచ్చెయ్యరు.. అలాగని, అభిమానులూ ఎదురు చూడొద్దు.!
Young Tiger NTR Fans.. ఎన్టీయార్ ఒక్కడే కాదు సుమీ..
ఇప్పుడంటే యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇలా బుక్కయ్యాడు. కాస్త లోతుగా ఆలోచిస్తే, ఇలాంటి డైలాగులు చెప్పని హీరోల్ని వేళ్ళ మీద లెక్కబెట్టాలేమో.!
అన్నట్టు, ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ అభిమాని అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై ‘బింబిసార’ టీమ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Also Read: అడివి శేష్ ఏదో ’కథ‘ చెప్తున్నాడు.. సన్నీలియోన్ వింటోందా.?
తమ అభిమాన హీరోల కోసం అభిమానులు అత్యుత్సాహం చూపడం కొత్తేమీ కాదు. కానీ, తమ కుటుంబాలు తమ అత్యుత్సాహం కారణంగా నాశనమైపోతున్నాయని అభిమానులు అర్థం చేసుకోకపోతే ఎలా.?
అభిమానం తప్పు కాదు.! కోట్లాది మంది అభిమానుల్ని మేనేజ్ చేయడమంటే స్టార్ హీరోలకు అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ ఎవర్నీ తప్పు పట్టలేం.!
అభిమానానికీ హద్దులుండాల్సిందే. అభిమానులే సర్వస్వం.. అని చెప్పే క్రమంలో నటీనటులు, ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం మంచిది.