Young Tiger NTR Warning.. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక అభిమానులు నానా తంటాలూ పడుతున్నారు. ఇదీ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల పరిస్థితి.
కానీ, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేయాల్సిన సినిమా విషయమై యంగ్ టైగర్ ఎన్టీయార్ ఆచి తూచి అడుగులేస్తున్నాడు.
‘అప్డేట్ ఏదన్నా వుంటే.. ఇంట్లో భార్య కంటే ముందు.. మీకే చెబుతాం..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్, అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.!
ఇదేదో, ‘అమిగోస్’ కోసం వచ్చిన ఎన్టీయార్ వ్యవహారంలా లేదు, అభిమానులకి ఇచ్చి పడెయ్యడానికే వచ్చినట్టున్నాడన్నట్టు తయారైంది పరిస్థితి.
జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ కూడా ఎన్టీయార్ వచ్చింది.. అభిమానులకి క్లాస్ తీసుకోవడానికేనేమో.!
కానీ, పడాల్సిందే.. ఇంకాస్త ఘాటైన డోసు పడి వుండాల్సిందేనేమో.! ఇది అందరు హీరోల అభిమానులకీ వర్తిస్తుంది.
Mudra369
తెలుగు సినిమా ‘గ్లోబల్’ స్థాయికి వెళ్ళాక, ప్రతి సినిమా విషయంలోనూ దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఇదే విషయాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ కుండబద్దలుగొట్టాడు.
Young Tiger NTR Warning.. హీరోలందరికీ అదే సమస్య..
‘నేనే కాదు.. హీరోలందరిదీ దాదాపు ఇదే సమస్య. మీరేమో అప్డేట్స్ అడుగుతారు.. అదిరిపోయే అప్డేట్ వుంటే.. అకేషన్ చూసుకుని చెప్పాలి.. అప్పటిదాకా మీరు ఆగరు..’ అంటూ ఎన్టీయార్ చురకలేశాడు అభిమానులకి.
‘ప్రతిరోజూ అప్డేట్ అంటే కుదరదు. ఏదో ఒకటి చెప్పేస్తే, మీరే మళ్ళీ తిడతారు. నిర్మాతల మీద ఎందుకు ప్రెజర్ పెడతారు.?’ అంటూ అభిమానులకి ఎన్టీయార్ క్లాస్ తీసుకున్నాడు.

‘మిమ్మల్ని ఏదో అనేస్తున్నానని కాదు. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. అర్థం చేసుకోండి..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యానించాడు.
అమిగోస్ వేదికగా..
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీయార్ తన తదుపరి సినిమా అప్డేట్ ఇచ్చాడు.
ఫిబ్రవరి నెలలోనే సినిమా ప్రారంభోత్సవం వుంటుందనీ.. మార్చి 20 లోపలే సినిమా సెట్స్ మీదకు వెళుతుందనీ.. 2024 ఏప్రిల్‌లో సినిమా విడుదలవుతుందని చెప్పాడు ఎన్టీయార్.
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ‘ఎన్టీయార్ 30’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
అన్నట్టు, ‘ఆర్ఆర్ఆర్’ ఘనత ఎవరిది.? అన్నదానిపై చరణ్, ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read: డబుల్ ధమాకా.! ఎన్టీయార్ ఫ్యాన్స్‌కి పండగే పండగ.!
‘ఆ ఘనత జక్కన్న రాజమౌళిదే..’ అని తేల్చేశాడు యంగ్ టైగర్. దాంతో, ఇరువురి అభిమానులూ ఇకపై ఈ రచ్చ ఆపేస్తారేమో చూడాలి.!
అదే సమయంలో అప్డేట్స్ విషయంలో నిర్మాతల్ని సోషల్ మీడియా వేదికగా ఆయా హీరోల అభిమానులూ వేధించడం మానేస్తారేమో.. ఎన్టీయార్ హెచ్చరిక తర్వాత.!