Ys Jagan Chennai Politics.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చెన్నయ్ వేదికగా సరికొత్త రాజకీయ మంతనాలకు తెరలేపారు.
అదేంటీ, వెళ్ళింది బంధువుల ఇంట్లో పెళ్ళికి అతిథిగా కదా.? అయితేనేం, కాదేదీ రాజకీయానికి అనర్హం.. అంటున్నాయి వైసీపీ శ్రేణులు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా, పలువురు సినీ ప్రముఖులు సూర్య, కార్తీ.. ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. తమిళానాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌తో కూడా వైఎస్ జగన్ మంతనాలు జరిపారట.
ప్రముఖ తెలుగు సినీ నటుడు మోహన్‌బాబు కూడా, చెన్నయ్‌లో జరిగిన వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారట.
‘ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేంజ్.. మొత్తం తమిళనాడు రాజకీయమంతా వైఎస్ జగన్ చుట్టూ తిరుగుతోంది..’ అంటూ వైసీపీ శ్రేణులు ఇస్తున్న ఎలివేషన్స్ ఓ రేంజ్లో వున్నాయ్.
సాధారణంగా ఏ పెద్ద పెళ్ళి వేడుకలో అయినా జరిగే తంతు ఇదే.! సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఒకరినొకరు తారసపడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటారు.
ఇలాంటి వేడుకల్లో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎంచక్కా పలకరించుకుంటారు. అది కనీసపాటి మర్యాద.! దీంట్లో రాజకీయం వెతకడం వైసీపీకే చెల్లింది.
మోహన్‌బాబు కూడా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బంధువే. మోహన్‌బాబు తనయుడు విష్ణు సతీమణి విరానిక, వైఎస్ కుటుంబం నుంచే వచ్చారు.
ఇక, తమిళ నటుడు సూర్య విషయానికొస్తే.. భారతి సిమెంట్స్ తరఫున ప్రచారకర్తగా పని చేశారు. సో, ఆ పరిచయాలతో ఆయన, ఆయన తమ్ముడు వచ్చి వుండొచ్చు.
పెళ్ళి ఎవరింట్లో జరిగిందో, వారికి తమిళ సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. సో, ఆ పరిచయాలతో ఆహ్వానాలు వెళ్ళాయి.. ప్రముఖులు వచ్చారు పెళ్ళికి.. వధూవరుల్ని ఆశీర్వదించారు.
అయినా, చెన్నయ్‌లో వైఎస్ జగన్ చేయగలిగే రాజకీయం ఏముంటుంది.? అక్కడి ప్రముఖులతో వైఎస్ జగన్ నడిపే రాజకీయం వల్ల ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రయోజనం ఏముంటుంది వైసీపీకి.?
అన్నట్టు, తమిళ రాజకీయాల్లో సంచలనంగా దూసుకొచ్చిన విజయ్ కూడా ఈ వివాహ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. దాంతో, వైసీపీ శ్రేణులు జగన్ – విజయ్ కాంబినేషన్ వేరే లెవల్.. అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
విజయ్ సినిమాలకి తెలుగునాట అస్సలు మార్కెట్ వుండదు. విజయ్ రాజకీయం, తెలుగు నాట చూపే ప్రభావం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
అసెంబ్లీకి వెళ్ళడుగానీ.. పెళ్ళిళ్ళకి వెళ్ళి టైమ్ పాస్ చేస్తుంటాడనే విమర్శల్ని వైఎస్ జగన్ ఎదుర్కోవడం మినహా, వైసీపీ శ్రేణులు వేసే ఎలివేషన్లకి అర్థం లేదు.
