Table of Contents
Ys Jagan Jamii Pulivendula.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! 2024 ఎన్నికల్లో వైసీపీ అత్యంత దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.
అంతకు ముందు, 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని అందుకుంది. ఓడిపోతే కుంగిపోకూడదు.. గెలిస్తే విర్రవీగకూడదు.
రాజకీయమంటే ప్రజా సేవ. కానీ, రాజకీయమంటే అధికారం.. పెత్తనం.. అని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు భావిస్తున్న కాలమిది.
సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోతున్నాం.? అన్న విషయాన్ని అధికారంలో వున్నవాళ్ళు గుర్తెరగాలి.
Ys Jagan Jamii Pulivendula.. బటన్ నొక్కితే.. పాతాళానికి..
బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసేస్తున్నాం.. ఇంతకన్నా ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలదు.? అని జగన్ అనుకున్నారు.
కట్ చేస్తే, వైసీపీ దారుణమైన ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి కూడా ఇదే. అప్పట్లో చంద్రబాబు అంచనాలు తల్లకిందులయ్యాయి.
ఏడాది క్రితం దారుణ పరాజయాన్ని రుచి చూసిన వైసీపీకి, ఎన్నికలు తొందరగా వచ్చేస్తే బావుణ్ణు.. మళ్ళీ అధికార పీఠమెక్కేయొచ్చన్న.. ఆశ వుండొచ్చుగాక.
ఏమో, జమిలి ఎన్నికలు రానూవచ్చు. వస్తే ఏమవుతుంది.? వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుందా.? రాదని చెప్పలేం, వస్తుందనీ చెప్పలేం.
ప్రజల మెదళ్ళలో ఏముంటుందో ఎవరికెరుక.?
ప్రజల మూడ్ ఏంటో తెలుసుకోవడం రాజకీయ పార్టీలకు అంత తేలిక కాదు. ప్రజలు కోరుకునే అభివృద్ధిని ప్రభుత్వాలు ఇవ్వలేవు.. సంక్షేమ పథకాలతో మభ్యపెడతాయంతే.
అదే అసలు సమస్య. అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు. కానీ, సంక్షేమం అనే అడ్డదారిలోనే అధికారంలో వున్నోళ్ళు పరుగులు పెడుతుంటారు.
ఇదిలా వుంటే, జమిలి ఎన్నికలొస్తే కూటమి ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోతుందని వైసీపీ అంటోంది. కానీ, జమిలితో జగన్‌కే నష్టమనే చర్చ అంతటా జరుగుతోంది.
పులివెందులలో వైఎస్ జగన్ కూడా గెలిచే పరిస్థితి వుండదు ఈసారి.. జమిలి వస్తే మంచిదే, వైసీపీకి గుండు సున్నా తప్పదన్న కామెంట్, కూటమి నుంచి వినిపిస్తోంది.
వైసీపీ పుంజుకోవాలంటే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పుంజుకోవాలంటే అంత తేలిక కాదు. దానికి కొంత సమయం పడుతుంది. 2029 ఎన్నికల నాటికి వైసీపీ సరైన వ్యూహ రచన చేసుకోవాల్సి వుంది.
తొందరపడి జమిలి ఎన్నికల మీద ఆశలు పెట్టుకుంటే, వైసీపీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.
Also Read: ఫిలిం సిటీలో దెయ్యం! కాజోల్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది?
లేదూ, గెలిచేస్తాం.. అనే ధీమా వైసీపీకి వుంటే, పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు తానే అగ్ని పరీక్ష పెట్టుకోవచ్చు.
జగన్ సహా వైసీపీకి చెందిన మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు కూడా అగ్ని పరీక్షకు సిద్ధమైతే, రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది జమిలి సంగతి ఎలా వున్నా.!