Table of Contents
YS Jagan MaViGun.. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని గురించిన ప్రస్తావనే లేదు. దేశానికే రాజధాని వుంటుంది, రాష్ట్రాలకి రాజధానితో పని లేదు.!
కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వైఎస్ జగన్, కడప ఎంపీగా వున్నప్పుడూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుంది. రాష్ట్రాలకే కాదు, జిల్లాలకీ, మండలాలకీ రాజధానులుంటాయి.
కాకపోతే, జిల్లా కేంద్రం.. మండల కేంద్రం.. అని పిలుచుకుంటుంటాం. తమిళనాడు రాజధాని చెన్నయ్.. బెంగళూరు రాజధాని కర్నాటక.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా.!
అన్ని రాష్ట్రాలకూ రాజధానున్నాయి.. కేంద్ర పాలిత ప్రాంతాలకి కూడా రాజధానులున్నాయి. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుండకూడదు. ఎందుకిలా.? అసలేంటి, జగన్ బాధ.?
YS Jagan MaViGun.. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంటేనే వైఎస్ జగన్‌కి అసహ్యం..
అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎందుకు వుండకూడదు.? ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతుకు కక్ష గట్టేశారు.?
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు.. ఈ మూడు నగరాల్నీ కలుపుకుని MaViGun పేరుతో రాజధానిని ప్రకటించెయ్యండి.. అంటూ కూటమి ప్రభుత్వానికి బోడి సలహా ఇచ్చేశారు వైఎస్ జగన్.
ఓ వైపు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటూనే, ఈ MaViGun ప్రస్తావన ఏంటి.? అంతకు ముందుకు, ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని ఇదే జగన్ చెప్పారాయె.
వినేవారు వైసీపీ గొర్రెలైతే..
వినేవారు గొర్రెలైతే, చెప్పేది జగన్.. అన్నట్లుంది పరిస్థితి. వైఎస్ జగన్, ఇలా MaViGun అనగానే, గొర్రెల మందలా వైసీపీ కార్యకర్తలు, అహో.. ఒహో.. అంటూ భజన మొదలెట్టేశారు.
కానీ, వైసీపీలోనే చాలామందికి, తమ అధినేత వైఎస్ జగన్ మానసిక స్థితి పట్ల ఆందోళన కలుగుతోంది. రాజధాని అంటే, అది ప్రజల ఆత్మగౌరవం.
Also Read: రోజా రాజకీయమ్.! బూతులు.. తిట్టడమ్, తిట్టించుకోవడమ్.!
దేశ ప్రజలైనా, రాష్ట్ర ప్రజలైనా తమ తమ రాజధానిని ఆత్మగౌరవంగానే భావిస్తారు. రాజధాని చుట్టూనే అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి ఫలాలు, రాష్ట్రమంతా, దేశమంతా ప్రజలకు అందాలి.
రాజకీయ విమర్శలు చేసే క్రమంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రతిసారీ బెడిసికొడుతోంది. అయితే, ఇది పూర్తిగా జగన్ పాండిత్యమేనా.? అంటే, ఏమో.. అదీ అనుమానమే.!
కమెడియన్ జగన్..
పెద్ద కామెడీ ఏంటంటే, MaViGun అంటే, అందులో ‘గన్’ అనగా, జగన్ అని వుంటుంది కాబట్టి, అది టీడీపీకి నచ్చదు కాబట్టి, వేరే పేరు మార్చుకోవచ్చని బోడి సలహా ఇవ్వడం.
Machilipatnam నుంచి Ma, Vijayawada నుంచి Vi, Guntur నుంచి Gun తీసుకోవాలట. జగన్ ఉవాచ ఇది. రెండేసి అక్షరాలు తీసుకుంటే, MaViGu అవుతుంది కదా.?
Guntur నుంచి మూడక్షరాలు GUN ఎందుకు.? ఇక్కడ మళ్ళీ జగన్ పబ్లిసిటీ పైత్యం.! నలుగురూ నవ్విపోదురుగాక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటి సిగ్గు.?
ఇదిలా వుంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ, లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లుని ప్రవేశపెట్టింది, ఆమోదం పొందింది కూడా.
అదే రోజున వైఎస్ జగన్, ఈ తలతిక్క ‘మవిగన్’ ప్రస్తావన తీసుకురావడం కొసమెరుపు. రాష్ట్రానికి సంబంధించిన ఓ చారిత్రక ఘట్టం జరుగుతుంటే, అది జీర్ణించుకోలేని జగన్, రాష్ట్రానికి హానికరం.
