Ys Jagan Sharmila Assets.. అప్పుడెప్పుడో సోదరికీ, తల్లికీ.. కంపెనీల్లో వాటాల్ని రాసిచ్చారట.! వాటిని రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారట.
సోదరి తనకు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం నచ్చక, ఇలా కోర్టుకెక్కి, సోదరితోపాటు తల్లినీ కోర్టుకీడ్చాడట ఆయన.!
తెలుసు కదా.. ఆయనెవరో.! ఔను, ఆయనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒకప్పుడు ఇదే షర్మిల, విజయమ్మ సాయంతో రాజకీయాలు చేశారు. రాజకీయంగా ఎదిగారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే, ఆ జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. దేశ రాజకీయాల్లో అప్పటిదా ఏ మహిళా చేయని సాహసం అది.!
Ys Jagan Sharmila Assets.. తల్లికీ, చెల్లికీ ఇచ్చే గౌరవం ఇదేనా.?
ఇక, విజయమ్మ సంగతి సరే సరి.! జగన్ కోసమే విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మీద సింపతీ వల్లనే వైఎస్ జగన్, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవగలిగారు.
ఈ లెక్కన, వైఎస్ షర్మిలకు కావొచ్చు, వైఎస్ విజయమ్మకి కావొచ్చు.. తన సంపాదనంతా ధారపోసినా.. అది తక్కువే అవుతుంది.

సరే, ఏ కుటుంబంలో అయినా అభిప్రాయ బేధాలుండొచ్చు.! కానీ, కొడుకు నుంచి ప్రాణ భయం కారణంగా తల్లి విదేశాలకు పారిపోయిందన్న ప్రచారం విజయమ్మ విషయంలోనే ఎందుకు జరిగింది.?
గోడకేసి కొట్టింది నిజమేనా.?
‘న్యాయ బద్ధంగా జరగాల్సిన ఆస్తి పంపకాల గురించి మాట్లాడితే, మా అన్న నన్ను గోడకేసి కొట్టాడు..’ అని వైఎస్ షర్మిల ఎందుకు చెప్పాల్సి వచ్చింది.?
మీడియా ముందుకొస్తే చాలు, విలువలు.. విశ్వసనీయత.. అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలూ.. అంటూ ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తుంటారాయన.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’పై ‘నీలి’ కుట్రలు షురూ.!
మరి, తోడ పుట్టిన చెల్లెలు.. కని పెంచిన తల్లి.. ఈ ఇద్దరి విషయంలో వైఎస్ జగన్ కనీసపాటి ‘మానవత్వం’ కూడా ప్రదర్శించకుండా, పైశాచికత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నట్టు.?
చివరగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఇంకెవరో కాదు, ఆయనే స్వయంగా రోడ్డు పడేసుకుంటున్నారు.