Table of Contents
Ys Jagan Small Thief.. అతనో చిన్న దొంగ అట.! అది చాలా చిన్న దొంగతనం అట.! అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో వుండి, బెయిల్ మీదున్న వ్యక్తి ఇస్తున్న సర్టిఫికెట్.!
ఇంతకీ, ఆ చిన్న దొంగ గారు చేసిన దొంగతనమెక్కడో తెలుసా.? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. అది కూడా, పరాకమణిలో.!
దొంగిలించిన సొమ్ము విలువ 72 వేల రూపాయలు.! ఆ విలువ చేసే అమెరికన్ డాలర్లను సదరు దొంగ గారు కొట్టేశారు.
ఈ దొంగతనం కోసం, మర్మాంగం వున్న చోట, ప్రత్యేకంగా ఓ తిత్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ దొంగ.! ఏళ్ళ తరబడి దొంగతనం జరుగుతూనే వుంది.
ఈ దొంగ మామూలోడు కాదు..
దొంగతనం బట్టబయలయినప్పుడు, అమెరికన్ కరెన్సీ తొమ్మిది నోట్లు పట్టుబడ్డాయ్. మన కరెన్సీలో దాని విలువ 72 వేలు అని నిర్ధారించారు టీటీడీ అధికారులు.
ఈ కేసు విచారణ అధికారి ఒకరు, ఇటీవల అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. హత్య కేసుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు విచారణ జరుగుతోంది.
దాదాపు పదేళ్ళపాటు రవికుమార్ అనే దొంగ, పరాకమణిలో దొంగతనం చేస్తూ వచ్చాడంటే, అతనెంత పెద్ద దొంగ.. అనేది అర్థమవుతోంది కదా.?
కొట్టేసింది 72 వేల రూపాయలు మాత్రమే, చిన్న దొంగతనం.. అంటున్నారు వైఎస్ జగన్. అంతే కాదు, సదరు దొంగ గారు ప్రాయిశ్చిత్తం కూడా చేసుకున్నారట.
దొంగకి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్న జగన్
14 కోట్ల రూపాయల విలువైన భూముల్ని టీటీడీకీ ఇచ్చిందట దొంగ గారి కుటుంబం. ఈ విషయాన్ని కూడా స్వయంగా వైఎస్ జగన్ సెలవిచ్చి, దొంగ గారికీ, దొంగ గారి కుటుంబానికీ సర్టిఫికెట్ ఇచ్చారు.
అయినా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన సొమ్ముల్ని, అది కూడా భక్తులు హుండీలో వేసిన సొమ్ముల్ని కొట్టేసిన దొంగని వైఎస్ జగన్ వెనకేసుకు రావడమేంటి.?
14 కోట్ల రూపాయల విరాళం ఇచ్చే స్థాయి వున్న దొంగ, జస్ట్ 72 వేల రూపాయల దొంగతనాన్ని, అంత కష్టపడి ఎలా చేస్తాడు.?
సో, తెరవెనుకాల పెద్ద కథే వుందన్నమాట.! ఎన్ని కోట్లు.. వందల కోట్లు నొక్కేసి.. బొక్కేసి.. 14 కోట్ల రూపాయల విలువైన భూముల్ని, సదరు దొంగ తరఫున, దొంగ గారి కుటుంబం విరాళంగా ఇస్తుంది.?
వైసీపీ హయాంలోనే..
కాస్త లోతైన విచారణే జరగాలి ఈ కేసులో. అసలంటూ, ఇలాంటి దొంగని వైఎస్ జగన్ ఎలా వెనకేసుకొచ్చారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.!
వైసీపీ హయాంలో తిరుమల కేంద్రంగా నకిలీ నెయ్యి కుంభకోణం జరిగిందనే ఆరోపణలున్నాయి. అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిథులు, వీఐపీ దర్శనాల పేరుతో.. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలూ లేకపోలేదు.
ఇప్పుడేమో, ఈ దొంగ వ్యవహారం. ఇది కూడా, 2023లో.. అంటే, వైసీపీ హయాంలో వెలుగు చూసిన దొంగతనమే.! ఆ దొంగని వైఎస్ జగన్ వెనకేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
హుండీ సొమ్ము.. అంటే, వెంకన్న భక్తుల ఆస్తి. అందులో ఒక్క రూపాయి అయినా, అత్యంత విలువైనది. హిందువుల మనోభావాలతో కూడుకున్నది.
ఇలాంటి విషయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వెటకారాలు మానుకుంటే మంచిది.
