Table of Contents
YSRCP Ugly Propaganda HHVM.. జనసేన పార్టీ అంటే, వైసీపీకి అస్సలు గిట్టదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి ఎవరైనా మద్దతిస్తే, అంతే సంగతలు.. ఆయా సినీ ప్రముఖుల్ని బ్యాన్ చేస్తామని ప్రకటించేస్తుంటారు వైసీపీ అభిమానులు.
సరే, రాజకీయం అంటే అన్నీ వుంటాయ్.! కాదేదీ, రాజకీయానికి అనర్హం. సినిమా కూడా రాజకీయానికి అనర్హమేమీ కాదు. పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు.
అదే సమయంలో, పలువురు రాజకీయ నాయకులు సినీ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. తమ ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖుల్ని వాడుతుంటారు.
YSRCP Ugly Propaganda HHVM.. సినిమా.. రాజకీయం.. ఇదేమీ కొత్త కాదు..
సినిమా, రాజకీయం.. కలగలిసి వుండటం కొత్త కాదు. రాజకీయాలపై సినిమాల్లో సెటైర్లు, సినిమాల గురించి రాజకీయాల్లో రచ్చ.. ఎప్పటినుంచో నడుస్తున్నదే.
కాకపోతే, రాజకీయం ఇప్పుడు హద్దులు దాటి, సినిమాపై విషపు ప్రచారం మొదలు పెట్టింది. అది అత్యంత జుగుప్సాకరంగా మారిపోయింది.

రాజకీయ నాయకులు, సినిమాలకు రివ్యూలు ఇవ్వడం ఎప్పుడైనా చూశామా.? వైసీపీ నేతలతోనే మొదలైందది. మంత్రులుగా పని చేసినవారూ, పవన్ కళ్యాణ్ సినిమాలకు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు.
అయితే, ఆ రివ్యూలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.. ఆయా సినిమాల విషయంలో. అది తెలిసీ, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి మళ్ళీ వైసీపీ నేతలు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు.
కులం.. మతం.. ఇదో రోగం..
వైసీపీ కార్యకర్తలైతే, పూర్తిగా రాజకీయాల్ని వదిలేసి, ‘హరి హర వీర మల్లు’ సినిమాపై నెగెటివ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మొదలైంది ఈ రచ్చ.
అప్పటినుంచీ, ఇప్పటిదాకా.. ‘హరి హర వీర మల్లు’ సినిమాపై వైసీపీ నెగెటివ్ ప్రచారం కొనసాగుతూనే వుంది. దీంట్లో, ‘కులం’ కోణాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.
‘కాపు’ సామాజిక వర్గం అంటే, అస్సలేమాత్రం గిట్టని వైసీపీలోని ‘రెడ్డి’ సామాజిక వర్గం, సోషల్ మీడియా వేదికగా ‘హరి హర వీర మల్లు’ సినిమా మీద దుష్ప్రచారం చేస్తోంది.
చిత్రంగా, ‘మత కోణంలోనూ’ ‘హరి హర వీర మల్లు’ సినిమా మీద, వైసీపీ కార్యకర్తలు కొందరు జుగుప్సాకరమైన నెగెటివ్ ప్రోపగాండా చేస్తున్నారు.
సహజంగానే, కాపు సామాజిక వర్గం ఈ వ్యవహారంపై సీరియస్ అవుతోంది. సినిమాలపై ఈ రాజకీయ కుల పైత్యమేంటి.? అని వైసీపీలోని, కాపు సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు గుస్సా అవుతున్నారు.
ఓజీ మీద కూడా ఇదే దాడి.?
పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ‘ఓజీ’ మీద కూడా ఇదే తరహాలో వైసీపీ దుష్ప్రచారం చేయనుందన్నది నిర్వివాదాంశం.
ప్రత్యర్థి ఆర్థిక మూలాలు దెబ్బ తీయడం.. ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయం. పవన్ కళ్యాణ్‌కి సినిమాలే ప్రధాన ఆదాయ వనరు. అక్కడ దెబ్బ కొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.
వైసీపీ గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ కొత్తగా కమిట్ అయిన సినిమాలేవీ లేవిప్పుడు. ఆయన గతంలో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తున్నారంతే.
నిజానికి, వైసీపీ చేస్తున్న యాగీ, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది. కాకపోతే, ఇది పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు ఒకింత చికాకు కలిగిస్తుంది.
చివరికి వైసీపీ దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ మీద కూడా ట్రోలింగ్ చేసేంతలా.!