2011 వరల్డ్ కప్ (2011 world cup) పోటీల్ని భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే, సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాని వరించిన వన్డే వరల్డ్ కప్ అది. ఆ సిరీస్‌ని టీమిండియా గెల్చుకోవడానికి ప్రధాన కారణం ఎవరు? ఇంకెవరు, (Yuvraj Singh Retirement) యువరాజ్ సింగ్ (Yuvaraj Singh).
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా (2011 Player Of the tournament Yuvaraj Singh) 2014 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా యువరాజ్ సింగ్ ఎంపికవడం వెనుక ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
తన శరీరంలో తనకు తెలియకుండా ఏదో జరుగుతున్నా, ఆ ‘జరుగుతున్న వ్యవహారం’ గురించి లోలోపల ఆందోళన పెరిగిపోతున్నా, ఆ ప్రభావం ఆట మీద అస్సలేమాత్రం పడకుండా చూసుకున్న ‘విజేత’ యువరాజ్ సింగ్.
వన్డే వరల్డ్ కప్‌ని టీమిండియా గెల్చుకున్న తర్వాతనే అందరికీ తెలిసింది యువరాజ్ సింగ్, క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని. విదేశాలకు వెళ్ళి, క్యాన్సర్‌కి వైద్య చికిత్స తీసుకుని, తిరిగి టీమిండియాలో చోటు దక్కించేందుకు యువీ పడ్డ కష్టం చూస్తే ఎవరికైనా ఓ ‘ఫైటర్’ గుర్తుకొస్తాడు.
ఆ రాజకీయమే.. పెను శాపంగా మారిన వేళ..
టీమిండియాలో చోటు సంపాదించుకోవడం కొందరికి తేలికేమో, మరికొందరికి మాత్రం చాలా కష్టం. వరుసగా వైఫల్యాలు చవిచూస్తున్నా కొందరికి జట్టులో చోటు దక్కుతుందేమో. యువీ లాంటివారికి మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటడం అవసరం.
వరుసగా రాణిస్తున్నా, క్రికెట్‌లో రాజకీయాల కారణంగా జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తే.? అలాంటి సందర్భాలు యువీ (Yuvi Retires) చాలానే చూశాడు. కానీ, ఆట మీద మమకారం తగ్గించుకోలేదు.
‘నేను ఫైటర్‌ని, క్యాన్సర్‌నే జయించేసిన విజేతను నేను. క్రికెట్‌లో రాజకీయాల్ని జయించలేనా.?’ అని తనను ప్రశ్నించుకున్నాడు.. తనలో తానే ధైర్యం నింపుకున్నాడు కూడా.
కానీ, క్రికెట్‌లోని రాజకీయాలు అతన్ని ఓడించేశాయి. అనేక అవమానాల్ని దిగమింగినా అనుకున్నది సాధించలేకపోయాడు. గౌరవప్రదంగా రిటైర్ అయ్యేందుకు కూడా ‘ఒక్క ఛాన్స్’ అడుక్కోవాలన్నది ఈ ఫైటర్‌కి ఎదురైన అత్యంత భయానకమైన సంఘటన. ‘
నా స్థాయిని నేను దిగజార్చుకోలేను’ అనుకున్నాడు, రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నాడు ఈ ఫైటర్. దాంతో అతని మీద గౌరవం మరింత పెరిగింది సగటు క్రికెట్ అభిమానికి.
ఛాన్స్ కోసం అడుక్కోవాలా?
యువరాజ్ సింగ్ (Yuvraj Singh Retirement) గొప్పతనానికి మరో నిదర్శనమేంటంటే, ప్రపంచ కప్ వన్డే పోటీలు జరుగుతున్న ఈ తరుణంలో, ఎలాంటి అలజడీ రేగకూడదని మౌనంగా తనకిష్టమైన ఆటకి గుడ్ బై చెప్పేయడం.
వావ్ యువరాజ్ సింగ్ నువ్వు నిజమైన ‘సైనికుడివి’ అని సగటు క్రికెట్ అభిమాని సగర్వంగా తమ అభిమాన క్రికెట్ ఫైటర్‌కి సెల్యూట్ చేస్తున్నారు.
అవును మరి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేశ క్షేమమే సైనికుడి లక్ష్యం. యువరాజ్ సింగ్ అందుకు తక్కువేమీ కాదు.
యువరాజ్ సింగ్ మాత్రమే కాదు, సౌరవ్ గంగూలీ (Saurav Ganguly), గౌతమ్ గంభీర్ (Gautam Gambhir).. ఇలా చెప్పుకుంటూ పోతే, భారత క్రికెట్‌కి సంబంధించి చాలామంది కన్పిస్తారు.
కెరీర్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించి, క్రికెట్ రాజకీయాల కారణంగా కెరీర్ నుంచి బయటకు రావడమంటే అది అత్యంత బాధాకరమైన విషయం. అయితేనేం, వాళ్ళేమీ పరాజితులు కాదు.. వారే అసలు సిసలు విజేతలు.