ఈ బొద్దుగుమ్మ తొలుత సోషల్ మీడియాలో బోల్డంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. మోడలింగ్.. ఆపై సినిమాలు.. వెరసి, పెద్ద కథే వుంది.
ఫిట్నెస్ పేరుతో చాలా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిందిగానీ.. ఎప్పుడూ బొద్దుగానే కనిపిస్తుంటుంది.!
ఫిట్‌గా వుండటమంటే ఆరోగ్యంగా వుండటం తప్ప.. బక్కగా మారిపోవడం కాదన్నది ఈ బ్యూటీ చెప్పే ఫిట్నెస్ ఫిలాసఫీ.!
తొలి తెలుగు సినిమా విడుదల కాకుండానే ఈ బ్యూటీ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. అవకాశలైతే వస్తున్నాయ్‌గానీ ఈ బొద్దుగుమ్మకి సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు.
Ketika Sharma ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ.?
ఇంకెవరు.. కేతిక శర్మ.! దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ కేతిక శర్మ.

అన్నట్టు, ఈ బ్యూటీ కేవలం నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా.! చక్కని వాయిస్‌తో పాటలు పాడుతూ అందర్నీ ఆకట్టుకుంటుంటుంది ఈ బొద్దుగుమ్మ.
నచ్చింది తినండి.. తగినంత వ్యాయామం చేయండి. మీ ఫిజిక్ ఎలా వున్నా, మీరు ఆరోగ్యంగా వుండటమే ఫిట్నెస్ మంత్ర.. అని చెబుతోంది ఈ అందాల భామ.
Also Read: అరరె.! పెళ్ళయిపోయిందే.! ఇప్పుడెలా.?
కనిపిస్తోంది ఆ అందం.. ఆ బొద్దుతనంలోనే అసలైన అందం.. అనుకోవాలేమో.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఈ బ్యూటీలో సమ్‌థింగ్ స్పెషల్ వుండబట్టే, బోల్డంతమంది ఫాలోవర్స్ వున్నారమెకి.

చూస్తున్నారుగా.. ఫొటోల్లో కేతిక శర్మ ఎంత ముదుగా, బొద్దుగా వుందో.! దీన్ని అందం అనాలా.? మందం అనాలా.? ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. అంతా నా ఇష్టం.. అనే టైపు కేతిక శర్మ.