Meenakshi Chaudhary Cycle Ride.. మనిషన్నాకా కూసింత కళాపోషణ వుండాలి కదా.! ఈ ముద్దుగుమ్మ అది గ్రహించేసినట్లుంది అందుకే లైఫ్‌ని ఇదిగో ఇలా ఎంజాయ్ చేసేస్తోంది.
ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ అంటారా.? మీనాక్షి చౌదరి అండీ.! డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన ముద్దుగుమ్మ మీనాక్షి.
డెంటల్ సర్జరీలో డిగ్రీ పొంది, కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేసింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత సినిమాల్లో ఆసక్తితో మొదట మోడలింగ్ రంగం వైపు ప్రయాణం సాగించింది.

అలా అందాల పోటీల్లో విన్నర్‌గా నిలిచి, వెండితెరపై హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్ముతోంది. టాలీవుడ్‌తో పాటూ, కొన్ని కోలీవుడ్ సినిమాల్లోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది.
తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూనే నవీన్ పోలిశెట్టి వంటి యంగ్ హీరోలకూ జోడీ అవుతోంది మీనాక్షి చౌదరి.
Meenakshi Chaudhary Cycle Ride.. బ్యూటీ ఆఫ్ హ్యాపీనెస్
ప్రస్తుతం షూటింగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకుని ఆరుబయట చల్ల గాలిని ఆస్వాదిస్తోంది. అందులో భాగంగానే ప్రకృతితో మమేకమవుతూ రిఫ్రెష్ అవుతోంది.
సైకిల్ తొక్కిొతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందనీ, ఒత్తిడి అంతా తీరిపోతుందనీ చెబుతోంది మీనాక్షి చౌదరి.

అందుకే అప్పుడప్పుడూ ఏసీలలో గాలిని మాత్రమే కాదు.. ఆరు బయట గాలిని కూడా ఆస్వాదించాలని క్యూట్‌గా చెప్పేస్తోంది మీనాక్షి.
తన వెకేషన్ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా సైకిలింగ్‌తో పాటూ, పార్కుల్లో పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూనే నచ్చిన ఫుడ్‌నీ ఆవురావురమని లాగించేస్తోంది.
ఇష్టమైన ఫుడ్‌తో పాటూ తనకు నచ్చిన లైబ్రరీని కూడా దర్శించింది. లైబ్రరీలో బుక్స్ చదవడం తనకెంతో ఇష్టమని మీనాక్షి చెబుతోంది.

అందమైన లొకేషన్స్‌ని తన సెల్ఫీల్లో బంధించేస్తూ, ఆ లొకేషన్స్‌కి తన అందాలను జోడించి మరింత కిక్కెక్కిస్తోంది మీనాక్షి చౌదరి. ఈ తాజా లుక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయ్.
అన్నట్లు త్వరలోనే మీనాక్షి చౌదరి తెలుగు, తమిళ సినిమాలను దాటి బాలీవుడ్‌లోనూ సందడి చేయబోతోందని సమాచారం.
జాన్ అబ్రహాం సినిమాలో మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
