Home » నారీ సౌందర్యానికి నాజూకు సోకు ముక్కు పుడక.!

నారీ సౌందర్యానికి నాజూకు సోకు ముక్కు పుడక.!

by hellomudra
0 comments
Aarsha Chandini Baiju

Aarsha Chandini Baiju Mukkupudaka.. భారతీయ నారీ సంస్కృతీ సాంప్రదాయంలో ముక్కు పుడకకు ప్రత్యేక స్థానం వుంది.

నాగరికత మారినా, కాలాలు మారినా.. ఎన్ని సరికొత్త ట్రెండ్స్ చుట్టు ముట్టినా ముక్కు పుడకకున్న ఆ స్థానం మాత్రం మారలేదంతే.

చిన్న ముక్కు పుడక చందమామ మోముపై మెరిసే చక్కని తారకలా దాని స్థానాన్ని పదిలం చేసుకుంది.

తళుక్కున మెరిసే డైమండ్ రాయి అయినా, ఎర్రగా మెరిసే కెంపు రాయి అయినా నారీ మణుల కుందనపు ముఖానికి రెట్టింపు అందాన్ని తెచ్చేదే.!

Aarsha Chandini Baiju
Aarsha Chandini Baiju

ఇంటి పట్టునే వుండే సాంప్రదాయ మహిళ అయినా, ఆఫీసులకు వెళ్లే ట్రెండీ యువతి అయినా ముక్కు పుడకతో మెరిపించే మెరుపులు అన్నీ ఇన్నీ కావు.

అందుకే ట్రెండ్ మారినా ముక్కు పుడక ఇచ్చే క్లాసీ లుక్ మారనే లేదు.

Aarsha Chandini Baiju Mukkupudaka.. అందమే కాదు, ముక్కు పుడక ఆరోగ్యం కూడా.!

పురాణాల్లో ముక్కు పుడకను ఆడవారికి ఆరోగ్య చిహ్నంగానూ అభివర్ణిస్తారు. ముక్కు పుడక రంధ్రం కారణంగా హార్మోన్ల సమతుల్యత జరిగి, తద్వారా నెలసరి సమస్యలు తగ్గుతాయని అంటారు.

అలాగే, ప్రసవ సమయంలో కలిగే వేదనను తగ్గించేందుకు ముక్కు పుడక రంధ్రం తోడ్పడుతుందని శాస్త్రీయ నిపుణులు చెప్పే మాట.

Aarsha Chandini Baiju
Aarsha Chandini Baiju

మన పూర్వీకులు సూచించిన అన్ని సాంప్రదాయాల్లోనూ సాంప్రదాయంతో పాటూ శాస్త్రీయ కోణం కూడా దాగి వుంటుందనడానికి ఇదే చక్కని ఉదాహరణ.

ట్రెండ్ సెట్టర్స్ ముక్కు రింగులు (నోస్ రింగ్స్ మరియు నత్స్)

క్లాసీ లుక్ కోసం టీనేజ్ యువతలు, ఆఫీసుకెళ్లే మహిళలు సైతం ముక్కు రింగులను విరివిగా ఉపయోగిస్తున్నారు. సింపుల్ నోస్ రింగ్ అమ్మాయిలకు ట్రెండీ లుక్‌తో పాటూ, క్లాసీ టచ్ కూడా అందిస్తోంది.

అలాగే, మణులు పొదిగిన నత్తులు పెళ్లిళ్లు, పేరంటాల్లో అమ్మాయిల అందాలను మరింత పెంచేస్తున్నాయ్. అందరిలోనూ తాము ప్రత్యేకం అనేలా అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి.

ట్రెడిషనల్‌గా కనిపించేందుకు ఎంత ఖరీదైన పట్టు చీరలు ధరించినా.. ఒంటి నిండా ఆభరణాలు ధరించినా ఒక చిన్న ముక్కు పుడక.. నల్లని రాతిపై పడే వెన్నెల చుక్కలా ఆడవారి మోముకు వాడిపోని కళ తెస్తుందనడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

Aarsha Chandini Baiju
Aarsha Chandini Baiju

అందుకే నయా ట్రెండ్‌లో భాగంగా అమ్మాయిలు ముక్కు కుట్టు లేకపోయినా ప్రెస్సింగ్ రింగ్స్ ధరించి ఆ నాజూకు స్పర్శను ఆస్వాదిస్తూ.. చందమామ వంటి తమ అందమైన మోమును మరింత అందంగా మలిచేసుకుంటున్నారు.

అన్నట్టు, ఫొటోల్లో కనిపిస్తున్నది ఆర్ష చాందిని బైజు. ఈమె మలయాళీ నటి.! పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిందీ బ్యూటీ.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group