అరరె.! హీరోయిన్ శృతి హాసన్‌ని (Shruti Haasan) ఎవరో భయపెట్టారట.! ఆ భయానికే జ్వరం వచ్చేసిందట.! ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.!
మెగాస్టార్ చిరంజీవి.. స్పాంటేనియస్‌గా హ్యూమర్ పండించడంలో దిట్ట. టైమింగ్‌లో మెగాస్టార్ చిరంజీవికి సాటి ఇంకెవరూ రారంతే.!
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శృతి హాసన్ డుమ్మా కొట్టేసింది. ప్చ్.! జ్వరం రావడంతోనే ఆమె అలా డుమ్మా కొట్టాల్సి వచ్చింది.
Shruti Haasan.. భయపెట్టిందెవరు.?
ఔను కదా, శృతి హాసన్‌ని ఎవరు భయపెడతారు.? ఏదో సరదాగా చిరంజీవి ఫన్ జనరేట్ చేశారంతే. దానికి కొందరు వక్రీకరణల్ని వండి వడ్డించారు.
రవితేజ మీదా సరదాగా చిరంజీవి సెటైర్లేశారు. అలా చిరంజీవి (Chiranjeevi) సరదాగా వేదిక మీద వుండబట్టే, ఆ ప్రోగ్రామ్ అంత పెద్ద సక్సెస్ అయ్యింది.
పేరు పేరునా సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరి గురించీ ప్రస్తావించారు మెగాస్టార్ చిరంజీవి. అదీ ఆయన గొప్పతనం.
‘వీర సింహా రెడ్డి’ కూడా ఘనవిజయం సాధించాలి..
తన సినిమా హిట్టవ్వాలని కోరుకోవడమే కాదు.. ఇతరుల సినిమాలూ హిట్టవ్వాలనీ, అంతిమంగా తెలుగు సినిమా బావుండాలని చిరంజీవి కోరుకుంటారు.
Also Read: Doppelganger.! మనిషిని పోలిన మనుషులట.!
ప్రతిసారీ చిరంజీవి నోట ఇతర సినిమాల ప్రస్తావన కూడా వస్తుంటుంది. ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమా ప్రస్తావన కూడా అలాగే వచ్చింది.
బాలకృష్ణ, శృతి హాసన్‌ని (Shruti Haasan) భయపెట్టారన్నది చిరంజీవి (Mega Star Chiranjeevi) మాటల్లోని అర్థమంటూ వక్ర భాష్యాలు చెప్పేవారి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగ.!
ఒక్క రోజు గ్యాప్‌లో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు విడుదలవుతున్నాయి. రెండిటినీ ఒకే నిర్మాణ సంస్థ నిర్మించింది. చిత్రంగా రెండు సినిమాల్లోనూ ఒకరే హీరోయిన్. ఆమే శృతి హాసన్.
సంక్రాంతి పండక్కి హీరోలు ఇద్దరు.. హీరోయిన్ మాత్రం ఒక్కరే.!
