Table of Contents
Iguana Island.. చుట్టూ సముద్రం.. అందులో ఓ ఐలాండ్.. దాంట్లో మళ్ళీ ఒకే ఒక్క ఇల్లు.! ‘వ్యూ’ అదిరిపోతుంది కదూ.!
మీ దేశానికి మీరే రాజు.. అన్నట్లుంటుంది వ్యవహారం. కావాలంటే, సెక్యూరిటీని పెట్టుకోవచ్చు కూడా.! కానీ, అక్కడ అంత ‘థ్రెట్’ ఏమీ వుండదట.
ఇప్పుడీ ద్వీపాన్ని, అందులో ఇంటిని అమ్మకానికి పెట్టారు. రేటు మరీ ఎక్కువేం కాదు. మన హైద్రాబాద్‌లో ఓ లగ్జరీ అపార్టుమెంట్ విలువ కూడా చెయ్యదు.!
సముద్రంలోని ద్వీపం కదా.? సునామీలు ముంచెత్తితేనో.! ఆ ప్రమాదం ఈ ద్వీపానికి లేదట. తుపాన్ల ముప్పు కూడా పెద్దగా వుండదట.
Mudra369
ద్వీపమంటే.. బయటి సమాజంతో కలవాలంటే, సముద్రాన్ని దాటాల్సిందే.! సో, మీకు ఓ పడవ ఖచ్చితంగా వుండి తీరాలి.!
ప్రకృతిలో మమేకమవ్వాలనుకునేంత భావుకత కూడా మీకుండాలండోయ్.! అప్పుడే, ఇగువానా ద్వీపం.. అందులోని ఇంటిలో ఒంటరిగా (కుటుంబంతో కలిసి) వుండగలరు.
Iguana Island.. సకల సౌకర్యాలతో..
మధ్య అమెరికాలోని నికరాగువాలో ఈ ద్వీపం వుంది. బ్లూ ఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి ఈ ద్వీపానికి దూరం 19.5 కిలోమీటర్లు మాత్రమే.
పేరేమో ఇగువానా ఐలాండ్. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపం వుంటుంది. ఓ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఈ ద్వీపంలో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయబడి వుంది.
ద్వీపం అందాల్ని తిలకించేందుకు.. వాచ్ టవర్ కూడా వుందండోయ్. వైఫై, టీవీ, ఫోన్ వంటి సౌక్యాలూ వున్నాయ్.
కొనుక్కోవాలంటే ఏం చేయాలి.?
ప్రైవేట్ ఐలాండ్ ఆన్‌లైన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళితే, అక్కడ నికరాగువా ప్రాంతంపై ఓ కన్నేస్తే.. ఇగువానా ఐలాండ్ వివరాలు దర్శనమిస్తాయట.
ఆ వెబ్ సైట్ చెబుతున్నదాన్ని బట్టి ఈ ఐలాండ్ ఖరీదు జస్ట్ 475 వేల డాలర్లు మాత్రమే. భారత కరెన్సీలో అయితే 3.87 కోట్లు. రేటు అదిరిపోయింది కదా.!
ప్రపంచం చాలా చాలా చిన్నదైపోయింది.! హాలీడే డెస్టినేషన్స్.. అంటూ ఎక్కడికెక్కడికో వెళుతున్నాం. అలాంటివారికి, ఈ ద్వీపం ఓ పెర్‌ఫెక్ట్ డెస్టినేషన్ అనుకోవచ్చు.!
రిస్క్ చేయాల్సిందే సుమీ.!
అన్నట్టు, ఆన్‌లైన్ వేలంలో పాల్గొని ఈ ద్వీపాన్ని సొంతం చేసుకోవాల్సి వుంటుందట.
సముద్రంలోని ద్వీపం కదా.? సునామీలు ముంచెత్తితేనో.! ఆ ప్రమాదం ఈ ద్వీపానికి లేదట. తుపాన్ల ముప్పు కూడా పెద్దగా వుండదట.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
ప్రమాదకరమైన జల చరాల మాటేమిటి.? ఆ విషయంలోనూ పెద్దగా ఇబ్బందులు లేవట. అయినా, రిస్క్ లేనిదెక్కడ.? లైఫ్‌లో రిస్క్ చేయకపోతే రస్క్ కూడా దొరకదండోయ్.!