Samyuktha Menon.. నటి సంయుక్త మీనన్ ‘భీమ్లానాయక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. రానా దగ్గుబాటి భార్యగా ‘భీమ్లానాయక్’ సినిమాలో నటించింది సంయుక్త మీనన్.
అయితే, సంయుక్త మీనన్ మొట్టమొదట సైన్ చేసిన తెలుగు సినిమా ‘బింబిసార’. ఆ తర్వాత ‘విరూపాక్ష’ సినిమాని ఓకే చేసింది. మూడో సంతకం ‘భీమ్లానాయక్’ కోసం పెడితే, అది కాస్తా మొదటగా రిలీజ్ అయ్యింది.
ఇక, ‘విరూపాక్ష’ విడుదల కావాల్సి వున్న సంగతి తెలిసిందే. ‘విరూపాక్ష’ కంటే ముందే, ‘సార్’ సినిమా వస్తోంది. ధనుష్ హీరోగా నటించిన సినిమా ఇది.
Samyuktha Menon తెలుగమ్మాయినైపోయా..
తెలుగమ్మాయిని కాకపోయినా, నన్ను తెలుగమ్మాయిలానే చూస్తున్నారంటూ సంయుక్త మురిసిపోతోంది. తెలుగులో మాట్లాడేందుకు ట్యూటర్‌ని పెట్టుకోవాల్సి వచ్చిందని సంయుక్త చెప్పుకొచ్చింది.

‘నిజానికి, తెలుగు సినిమాలతోనే నాకు స్టార్‌డమ్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ఆదరిస్తుండడం చాలా చాలా ఆశ్చర్యంగా వుంది’ అంటోంది సంయుక్త.
‘భీమ్లానాయక్’ సినిమా షూటింగ్ సమయంలో సమాజం పట్ల అవగాహన పెరిగిందనీ, పవన్ కళ్యాణ్.. రీల్ లైఫ్ హీరోయిజం కంటే, రియల్ లైఫ్ హీరోయిజం తనకు బాగా నచ్చిందని సంయుక్త చెబుతోంది.
Also Read: ఫాఫం నయనతార.! అజిత్ మీద అసహనంతో రగిలిపోతోందిట.!
ఇదిలా వుంటే, తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాక, తన పేరులోని ‘మీనన్’ని తొలగించానంటోంది సంయుక్త.
‘ఇంకా ఆ మీనన్ అనే పేరు కొనసాగించడం సబబు కాదనిపించింది. అందుకే, ఆ మీనన్‌ని నా పేరు నుంచి తొలగించా..’ అని ఓ ఇంటర్వ్యూలో సంయుక్త వెల్లడించింది.