Table of Contents
Shaakuntalam Review yeSBee.. మీకు తెలుసా.? ‘శాకుంతలం’ సినిమా కోసం బోల్డంత ఖర్చు చేశారట.! ఏదీ, తెరపై ఆ ఖర్చు తాలూకు గొప్పతనం ఎక్కడా కనిపించలేదే.!
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాపై అస్సలేమాత్రం పాజిటివ్ వైబ్స్ లేకుండా పోయాయి విడుదలకు ముందు.
దర్శక నిర్మాత గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’లోకి దిల్ రాజు అనూహ్యంగా వచ్చి పడ్డాడు.
‘నన్ను బాగా ఆకట్టుకుంది.. అందుకే, ఈ ప్రాజెక్టులోకి వచ్చా’ అని చెప్పాడు దిల్ రాజు. ఇంతకీ, దిల్ రాజుని ఆకట్టుకున్న విషయమేంటబ్బా.?
Shaakuntalam Review yeSBee.. ‘శాకుంతలం’ అందరికీ తెలిసిందే..
చాలామందికి ‘శాకుంతలం’ గురించి తెలిసే వుంటుంది. తెలిసిన కథే కాబట్టి, అందంగా.. అద్భుతంగా ఆ కథని తెరకెక్కించేందుకు ప్రయత్నించాలి.
సమంత పక్కనుండే ఇద్దరమ్మాయిలు చెప్పే సోది.. అర్థం పర్థం లేని కథనం.. వీటన్నిటి నడుమ, ‘శాకుంతలం’ నలిగిపోయిందన్నది నిర్వివాదాంశం.

చివర్లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ, ‘భరతుడిగా’ కనిపించిందిగానీ, ఆమె కోసం చేసిన సాగతీత, సినిమాని మరింతగా దెబ్బ తీసింది.
విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగానే వుంటే.. కొన్ని చోట్ల నాసిరకంగా అనిపిస్తాయ్. కాస్ట్యూమ్స్ విషయంలోనూ అంతే.!
సమంత కూడా చేతులెత్తేసిన వైనం..
సమంత గొప్పగా నటించేసిందా.? అంటే, అదీ లేదు. మిగతా పాత్రలూ అంతే. ఏ పాత్రలో ఎవరు నటించారో.. గుర్తు పట్టడం కూడా కష్టమయ్యింది.
ఓవరాల్‌గా ‘శాకుంతలం’ ఓ విఫల ప్రయోగం.! కాదు కాదు, ఆ అద్భుత కావ్యాన్ని, గుణశేఖర్ అండ్ టీమ్ చెడగొట్టింది.
శకుంతల పాత్రలో సమంత కాకుండా ఇంకెవరైనా అయితే బావుండేదన్న భావన కలిగిందంటే.. ఆమె కూడా ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయిందనే కదా అర్థం.?
ప్చ్.. ఏదీ సెట్ అవలేదంతే..
గుణశేఖర్ గత చిత్రం ‘రుద్రమదేవి’ కూడా వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శల్ని ఎదుర్కొంది. దాంతో పోల్చితే, ఇది కాస్త బెటర్.!
కానీ, ‘రుద్రమదేవి’ సినిమాకి అనుష్క సెంటరాఫ్ ఎట్రాక్షన్. ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో అల్లు అర్జున్ ఎక్స్‌ట్రా ఫోర్స్ అనిపించాడు.
Also Read: Free Hindu Temple.! హిందూ దేవాలయాలకి రాజకీయ గ్రహణం.!
ఈ ‘శాకుంతలం’ సినిమాకి సమంత మాత్రమే కీలక పాత్రధారి. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ మమ అనిపించాడుగానీ, ఇంకెవరైనా అయి వుంటే ఆ పాత్రకి మరింత న్యాయం చేయగలిగేవాడు.
థియేటర్‌కి వెళ్ళే సాహసం చేయలేక.. ఓటీటీలోకి వచ్చాక చూడాలా.? వద్దా.? అన్న మీమాంస నడుమ, తీరిక చూసుకుని సినిమాని వీక్షిస్తే.. సమయం దండగన్న భావన కలిగింది.!
– yeSBee