WTC Final Team India చిన్న విషయం కాదిది.! ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్.! ఒకసారి కాదు, రెండు సార్లు.. ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయింది.!
రెండో సారి ఓడిపోవడం, అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. రోహిత్ సేన, తేలిగ్గానే గెలిచేస్తుందని అంతా అనుకున్నారు.
అసలు ఈ స్థాయికి రావడానికి టీమిండియా (Team India) చాలా చాలా కష్టపడింది. చాలా కష్టమైన మ్యాచ్‌లని కూడా గెలిచి, ముందడుగు వేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరిగ్గా ఆడలేదు.. విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా మమ.. అనిపించేశాడు. మిగతా ఆటగాళ్ళలో రహానే కాస్త బెటర్ అంతే.!
ఎందుకు చేతులెత్తేశారబ్బా.?
ఇండియన్ ప్రీమియర్ మూడ్ నుంచి బయటకు రాని టీమిండియా ప్రధాన ఆటగాళ్ళు.. ఆస్ట్రేలియాతో జరిగిన ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్’ ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు.
ఎక్కడ లోపం జరిగింది.? ఈ వైఫల్యానికి కారణమెవరు.? ఒక్కరు కాదు.. అందరూ.! గెలుపుకైనా, ఓటమికైనా సమిష్టి బాధ్యత తీసుకోవాల్సిందే.
సెలక్టర్ల దగ్గర్నుంచి, టీమ్ మేనేజ్‌మెంట్ వరకు.. ఆటగాళ్ళు సైతం.. ఈ వైఫల్యానికి బాధ్యత తీసుకోకపోతే ఎలా.?

ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయాంగానీ, అప్పటిదాకా గెలుచుకుంటూనే వచ్చాం కదా.. అనుకుంటే కుదరదు.!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన టీమిండియా.. అన్న కీర్తి దక్కించుకోలేకపోయాం కదా.! మళ్ళీ ఫైనల్ వరకూ రావాలంటే, ఎంతలా కష్టపడాలి.?
WTC Final Team India.. అంపైరింగ్.. ఆసీస్‌ని గెలిపించింది..
అంపైరింగ్ లోపాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఆస్ట్రేలియాతో టీమిండియా (Team India) ఎప్పుడు తలపడినా.. ఇలాంటివి జరుగుతూనే వుంటాయ్.
అంపైర్లు ఆస్ట్రేలియాకి (Aussies) ఫేవర్ చేస్తారన్నది బహిరంగ రహస్యం. కానీ, ఈ ప్రధానమైన లోపాన్ని సరిదిద్దలేకపోతోంది ఐసీసీ.!
ప్రతిసారీ టీమిండియానే ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది.? కీలకమైన దశలో.. మ్యాచ్‌ని మలుపు తిప్పింది ఆ వివాదాస్పద నిర్ణయం.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
గిల్ ఔట్ కాకుండా వుండి వుంటే.. మ్యాచ్ ఫలితమే వేరేలా వుండేది. ఆస్ట్రేలియాని (Cricket Australia), ఆసీస్ ఆటగాళ్ళు గెలిపించారనడం కంటే, అంపైర్ గెలిపించాడనడం సబబేమో.!
అలాగని, టీమిండియా (Team India Men In Blue) సమిష్టి వైఫల్యాన్ని కూడా సమర్థించలేం.!
ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఎక్కడ వైఫల్యం చెందాం.? అన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకుని, ముందు ముందు ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందే.!