Neha Sharma Aisha Ice.. ఐస్ బకెట్ ఛాలెంజ్ అని.. ఆ మధ్య విన్నాం.! చూశాం.! ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో అదో ట్రెండింగ్ వ్యవహారం. ఇది కూడా దాదాపు అలాంటిదే.!
అందం.. ఆరోగ్యం.. అన్నీనూ.! అంటూ, ఈ మధ్య సొగసరి భామలు, ఐస్ బక్కెట్లలో (Ice Bucket Challenge) మునిగి తేలుతున్నారు.
బక్కెట్లు కావవి.. డబ్బాలు.! పెద్ద పెద్ద డ్రమ్ముల్లో చల్లని నీళ్ళు.. ఆపై ఐస్ క్యూబ్స్.! ఇంకేముంది.? అందులోకి దూకెయ్యడమే.!
Neha Sharma Aisha Ice.. శర్మ సిస్టర్స్.. పోటీ పడ్డారు.!
నేహా శర్మ (Neha Sharma) గుర్తుంది కదా.? అదేనండీ, రామ్ చరణ్ (Mega Power Star Ramcharan) హీరోగా నటించిన ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కదా.. ఆ నేహా శర్మే.
అటు నేహా శర్మ, ఇటు రామ్ చరణ్.. ఇద్దరూ ‘చిరుత’ సినిమాతోనే తెరంగేట్రం చేశార్లెండి. ఆ నేహా శర్మ, ఆమె సోదరి ఐషా శర్మ.. తాజాగా ఐస్ ముక్కలు నింపిన టబ్బులో సందడి చేశారు.
ఇంతకీ, ఎందుకిలా చేశారబ్బా.? అంటే అదో తుత్తి.! ఎవరి తుత్తి వారికి ఆనందం.!
శరీరం నాజూగ్గా మారుతుందా.?
దాదాపు గడ్డ కట్టేసిన స్థితిలో వున్న నీళ్ళు.. అందులోకి అందాల భామలు దూకితే, అనారోగ్య సమస్యలు రాకుండా వుంటాయా.?
అబ్బే, అలాంటిదేమీ వుండదట.! పైగా, ఇది మంచిది కూడానట.! వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. ఎన్నయినా చెప్పొచ్చు.

నిజానికి, ఇదేమంత మంచిది కాదు.! తేడా వస్తే ఆసుపత్రి పాలవ్వాల్సి వుంటుంది. వాళ్ళంటే తగిన జాగ్రత్తలు తీసుకుని చేస్తారు అవన్నీ.!
సో, సెలబ్రిటీల్ని చూసి.. ఒళ్ళు కాల్చుకోకండి.. సారీ సారీ.. ఒళ్ళు గడ్డ కట్టించుకోకండి.!
Also Read: ఇలియానా కొడుకు ఇడుగో.! భర్త ఎక్కడ.?
మొన్నామధ్య రకుల్ ప్రీత్ సింగ్.. విదేశాలకు వెళ్ళి.. ఇలాగే చేసింది. అయితే, అది సహజసిద్ధమైన ఐస్.!
అన్నట్టు, చక్కనమ్మ ఏం చేసినా.. అందులో ‘పబ్లిసిటీ స్టంట్’ ఖచ్చితంగా వుంటుంది.! అద్గదీ అసలు సంగతి.! వాళ్ళని ఫాలో అయ్యేముందు జర జాగ్రత్త సుమీ.!
