Vikram Thangalaan.. ‘చియాన్’ విక్రమ్.! తమిళ నటుడు విక్రమ్‌ని అక్కడి అభిమానులు ఇలాగే ముద్దుగా పిలుచుకుంటారు.!
విక్రమ్ ఓ సాధారణ నటుడని ఎవరైనా అనగలరా.? ఛాన్సే లేదు.! విశ్వనటుడు కమల్ హాసన్‌తో పోల్చదగ్గ ప్రత్యేకతలున్న నటుడు విక్రమ్.!
ఆ మాటకొస్తే, ‘అంతకు మించి’ అని కూడా అనొచ్చు.! సినిమా సినిమాకీ పాత్రల పరంగా ఎంతో విభిన్నంగా వుండాలనుకుంటాడు.. అదే విక్రమ్ ప్రత్యేకత.
ఆయా పాత్రల కోసం విక్రమ్ పడే శారీరక కష్టం, మానసిక కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
Vikram Thangalaan.. అప్పట్లో అలా..
‘ఐ’ సినిమా కోసం విక్రమ్ పడ్డ కష్టం గురించి మాటల్లో వర్ణించలేం.! తీవ్ర అనారోగ్య సమస్యలూ ఎదుర్కొన్నాడు ఆ సినిమా సమయంలో విక్రమ్.
ఇక, ఇప్పుడు ఇంకోసారి అలాంటి రిస్క్ తీసుకున్నట్లే కనిపిస్తోంది ‘తంగలాన్’ కోసం.! ‘తంగలాన్’ విక్రమ్ కొత్త సినిమా.
తాజాగా, ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ ‘తంగలాన్’ ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అది.
అందులో, విక్రమ్‌ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.! సోషల్ మీడియాలో తొలుత ఈ పోస్టర్ కనిపించినప్పుడు, ‘ఎవరో..’ అని లైట్ తీసుకున్నారు చాలామంది.
కానీ, విక్రమ్ సినిమా అని తెలిశాక.. ఆశ్చర్యపోయారు.! చూస్తున్నారు కదా, విక్రమ్ ట్రాన్స్‌ఫార్మేషన్.! దటీజ్ విక్రమ్.!