Table of Contents
Pawan Kalyan HHVM Teaser.. ఓ వైపు, తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతోంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్ సభతోపాటు, అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడంలేదు. కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెట్టింది జన సేన పార్టీ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Pawan Kalyan HHVM Teaser.. అటు ఎన్నికలు.. ఇటు సినిమా..
ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా వుంటున్నారు.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu Teaser) సినిమా టీజర్ బయటకు వచ్చింది.
ఎన్నికల సందడిలో జనసైనికులు బిజీగా వున్న ఈ తరుణంలో, ‘హరి హర వీర మల్లు’ సినిమా జనసైనికులైన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత వరకు ఉత్సాహాన్నిచ్చింది.?
తెలంగాణలో అయితే, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులే ఈ టీజర్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నారు.
డబుల్ ధమాకా..
ఆంధ్ర ప్రదేశ్‌లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. కాకపోతే, ఓ వైపు రాజకీయాలు.. ఇంకో వైపు సినిమా.. పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ ధమాకా ఇప్పుడు.
‘హరి హర వీర మల్లు’ టీజర్ (Hari Hara Veera Mallu Teaser) ముచ్చట్లను చర్చించుకుంటూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు జనసైనికులుగా మారిన పవన్ కళ్యాణ్ అభిమానులు.

‘హరి హర వీర మల్లు’ టీజర్ విషయానికొస్తే, ‘ధర్మం కోసం యుద్ధం’ అంటూ ఈ టీజర్‌ని చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేయడం గమనార్హం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) రాజకీయ పోరాటం కూడా ఇదే లైన్‌లో సాగుతుండడం మరో ఆసక్తికరమైన అంశం.
క్రిష్‌కి ఏమయ్యింది.?
ఏఎం రత్నం నిర్మిస్తున్న ‘హరి హర వీర మల్లు’ సినిమాకి క్రిష్ దర్శకుడు. అయితే, అనివార్య కారణాల వల్ల క్రిష్ జాగర్లమూడితోపాటుగా ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ కూడా దర్శకత్వం వహించాల్సి వస్తోంది.
ప్రాజెక్టు నుంచి చివరి నిమిషంలో క్రిష్ తప్పుకున్నాడు. కాదు కాదు, సినిమా నిర్మాణం ఆలస్యమవుతుండడంతో, తన తదుపరి సినిమాల కమిట్మెంట్స్ నేపథ్యంలో ఆయన ఈ ప్రాజెక్టుకి దూరమయినట్లు చెబుతున్నారు.
Also Read: కొబ్బరి బొండాల ‘కత్తి అందుకో’.. ‘జాణ’కీ.!
ఇంతకీ, ‘హరి హర వీర మల్లు’ టీజర్ (Hari Hara Veera Mallu Teaser) ఎలా వుంది.? ఇంకెలా వుంటుంది.. పవర్ ప్యాక్ట్ టీజర్ ఇది.!
ఆ మేకింగ్ వాల్యూస్ చూస్తోంటే, పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపేలానే వుంది. పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) యాక్షన్ ఎపిసోడ్స్‌లో తన ట్రేడ్ మార్క్ చూపించారు.
ప్రజల్ని దోచుకునే ప్రభువులు.. ఆ ప్రజా కంటక ప్రభువుల్ని దోచుకునే హరి హర వీర మల్లు.. ఇదీ ఈ సినిమా కథ.!