Malavika Mohanan Thangalaan Aarthi.. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తంగలాన్’ సినిమా విడుదలకు సిద్ధమైంది.
మాళవిక మోహనన్ (Malavika Mohnan) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ‘తంగలాన్’లో మాళవిక పాత్ర పేరు ఆరతి.
‘ఆరతి’ పాత్ర, ప్రేక్షకుల్ని భయపెడుతుందట.. ఏడిపిస్తుందట కూడా.! కానీ, ఆ పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని మాళవిక మోహనన్ (Malavika Mohanan) చెబుతోంది.
తన కెరీర్‌లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నిటిలోకీ ‘తంగలాన్’ చాలా ప్రత్యేకమైన సినిమా అనీ, ఇందులోని ‘ఆరతి’ పాత్ర నటిగా తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
Malavika Mohanan Thangalaan Aarthi.. చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారట..
నిజంగానే, ‘ఆరతి’ పాత్రని దర్శకుడు చాలా స్పెషల్‌గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పాత్రకి సంబంధించి మేకప్ కోసమే, నాలుగు గంటల సమయం పట్టేదట ప్రతిరోజూ.

నాలుగు గంటల మేకప్, ఆపై ఆ మేకప్‌ని జాగ్రత్తగా చూసుకునేందుకు టచప్స్.. ఇదంతా చాలా కష్టసాధ్యమైన వ్యవహారంగా మారేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మాళవిక మోహనన్.
Also Read: ఛ.! నిజమా.? నీకెవరు చెప్పారు పాయల్.?
ఇలాంటి విభన్నమైన పాత్రలు పోషిస్తేనే, నటిగా తనలోని కొత్త కోణం ప్రేక్షకులకు పరిచయమవుతుంటుందని మాళవిక మోహనన్ అభిప్రాయపడింది.
అన్నట్టు, ఈ పాత్ర సినిమాలో వీరోచితమైన పోరాటాలు కూడా చేసేస్తుంటుంది. ప్రమోస్‌లో ఆ యాక్షన్ ఎపిసోడ్స్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది.
షూటింగ్ సమయంలో చిన్నా చితకా గాయాల్ని కూడా మాళవిక మోహనన్ ‘తంగలాన్’ సినిమా కోసం రుచి చూడాల్సి వచ్చిందట.
తెలుగులో చాలాకాలం క్రితం విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) జతకట్టింది మాళవిక మోహనన్. ఆ సినిమా పేరు ‘హీరో’.
కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తోంది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.