Sreeleela Special Song Pushpa.. అరరె.. శ్రీలీల ఏంటీ, ఐటమ్ బాంబ్ స్థాయికి దిగజారిపోయింది.? అన్న చర్చ జరుగుతోంది.! ‘జనతా గ్యారేజ్’ సినిమా టైమ్‌లో కాజల్ అగర్వాల్ గురించీ ఇలాగే అనుకున్నారు.!
తెలుగు తెరపై ఐటమ్ సాంగ్స్ కొత్తేమీ కాదు.! హీరోయిన్లు, ఆ ఐటమ్ సాంగ్స్‌లో డాన్స్ చేయడమూ కొత్త కాదు.! ‘పుష్ప’ కోసం సమంత ఐటమ్ బాంబ్‌లా మారిన సంగతి తెలిసిందే.
శృతిహాసన్, తమన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే.! ఐటమ్ సాంగ్స్ కాదు, స్పెషల్ సాంగ్స్ అంటున్నాం ఇప్పుడు మనం.
ఇవే.. ఒకప్పుడు ‘వ్యాంప్’ అనబడే కొందరు నటీమణులు చేసిన డాన్సులు. జయమాలిని, సిల్క్ స్మిత.. లాంటోళ్ళు ప్రత్యేకంగా వుండేవారు.
Sreeleela Special Song Pushpa.. కాలం మారింది కదా..
రోజులు మారాయ్.. హీరోయిన్లు, ఐటమ్ సాంగ్స్ కోసం కోట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. ఆయా సినిమాలకు ఆయా సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతున్నాయి కూడా.
మరి, శ్రీలీల విషయంలోనే ఎందుకిలా.? అంటే, అదంతే.! నటనలో శ్రీలీల ఇంకా తానేంటో ప్రూవ్ చేసుకోలేదు.
‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అయినాగానీ, జస్ట్ ఐటమ్ బాంబ్ లాంటిదే.. అని తేల్చేశారు. ఆమె చేసిన డాన్సులు అలాంటివి.
Also Read: అప్పట్లో అనుష్క.! ఇప్పుడేమో దిశా పటానీ.!
శ్రీలీల మంచి డాన్సర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కాకపోతే, యాక్టింగ్ టాలెంట్ కూడా చూపించాలి కదా.?
నటిగా తెరపై తేలిపోతోంది శ్రీలీల. చేతిలో సినిమాలున్నాయ్.. వయసూ వుంది ప్రూవ్ చేసుకోవడానికి.!
‘పుష్ప 2 ది రూల్’ సినిమాలో ఐటమ్ సాంగ్ తర్వాత, శ్రీలీల దశ ఎలా తిరగనుందోగానీ, ‘ఐటమ్ బాంబ్’ మాత్రమే.. అని ట్యాగ్ పడిపోతే కష్టం.!