Chiranjeevi Nayanthara Mega157 ChiruAnil హ్యాట్రిక్ కొట్టేద్దామంటున్నరు మెగాస్టార్ చిరంజీవి.! అదీ, ‘నయనరతార’ కాంబినేషన్లో. ఇప్పటికే ఈ ఇద్దరూ రెండు సినిమాల్లో నటించేశారు.
అందులో ఒకటి ‘సైరా నరసింహారెడ్డి’ కాగా, మరొకటి ‘గాడ్ ఫాదర్’. ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.
‘సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం’ అని హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఆల్రెడీ ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా, నయనతార ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది.
Chiranjeevi Nayanthara Mega157 ChiruAnil.. నయనతార.. మారిందహో.!
నయనతార అంటే, ‘లేడీ సూపర్ స్టార్’ అంటారు కొందరు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార మాత్రమే.. అనేవారూ లేకపోలేదు.
కానీ, నయనతారతో పెద్ద సమస్యే వుంది. అదేంటంటే, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందిగానీ, సినిమాల్ని ప్రమోట్ చేయదు.

తాను నటించిన సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో నయనతార కనిపించకపోతే ఎలా.?
తమిళ సినిమాలకి కొంత టైమ్ ఇస్తుందిగానీ, తెలుగు సినిమాలకు అస్సలు ప్రమోషనల్ ఈవెంట్స్ నిమిత్తం టైమ్ కేటాయించదు నయనతార.
కానీ, ఆ నయనతార చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ కోసం, ప్రమోషనల్ వీడియోలో సందడి చేసింది.
Also Read: కట్టుబట్టలతో ఆమె పంచన చేరాడట ‘హీరో’ రవి.!
మేకప్ రూమ్ దగ్గర్నుంచి, కారులో వెళుతూ.. తెలుగు సినిమా గురించీ, మెగాస్టార్ చిరంజీవి గురించీ ఆమె చెప్పిన మాటలు అదుర్స్ అంతే.
వచ్చెయ్.. హ్యాట్రిక్ కొట్టేద్దాం.. అంటూ, చిరంజీవి కూడా నయనతారని ప్రాజెక్టులోకి వెల్కమ్ చెబుతూ ట్వీటెయ్యడం గమనార్హం.
2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి వుంది. 2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే.
మిగతా విషయాలెలా వున్నా, తెలుగులో తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నయనతార ఎట్టకేలకు ముందుకొచ్చినట్లే కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్లలో నయనతార సందడి చేస్తే, ఆ కిక్కే వేరప్పా.!