Table of Contents
Manchu Manoj Re-Release Bhairavam.. రీ-రిలీజ్ సినిమాల్ని, శుక్రవారం కాకుండా, మరో రోజు విడుదల చేసుకుంటే బావుంటుంది.! ఇదీ సినీ నటుడు మంచు మనోజ్ ఆవేదన.!
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన ‘భైరవం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్లో మంచు మనోజ్, రీ-రిలీజ్ సినిమాల గురించి వ్యాఖ్యానించాడు.
Manchu Manoj Re-Release Bhairavam.. భైరవం వర్సెస్ ఖలేజా..
మహేష్‌బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో చాలాకాలం క్రితం వచ్చిన సినిమా ‘ఖలేజా’. అనుష్క హీరోయిన్. ఈ సినిమా అప్పట్లో అంచనాల్ని అందుకోలేకపోయింది.
కానీ, రీ-రిలీజ్ సందర్భంగా మహేష్ అభిమానులు, థియేటర్ల వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. డైరెక్ట్ రిలీజ్ తరహాలో హడావిడి నడిచింది.

పెద్ద సంఖ్యలో థియేటర్లు ‘ఖలేజా’కి కేటాయించారు.. సినిమాకి టిక్కెట్లు కూడా బాగానే తెగాయి. స్టార్ వాల్యూ.. అలాంటిది మరి.
‘ఖలేజా’తో పోల్చితే, ‘భైరవం’ సినిమాకి తక్కువ టిక్కెట్లు తెగాయా.? అంటే, ఔననే చెప్పాలి. అదీ అసలు సంగతి. రీ-రిలీజ్ విషయమై సినీ పరిశ్రమలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సినిమా అంటే వ్యాపారం.. అది నిజమే అయినా..
సినిమా అంటేనే వ్యాపారం.. కానీ, పాత సినిమాలు వచ్చి, కొత్త సినిమాల్ని వెక్కిరిస్తే ఎలా.? అన్న ప్రశ్న కూడా లేకపోలేదు.
ఒకప్పుడు రీ-రిలీజ్ వ్యవహారాలు వేరు. ఇప్పుడు నడుస్తున్న తతంగం వేరు. ఏ సినిమాకి అయినా, శుక్ర – శని – ఆదివారం వసూళ్ళతోనే ఖేల్ ఖతమ్.
ఆ మూడు రోజుల్లో, రీ-రిలీజులు వచ్చేసి, డైరెక్ట్ రిలీజుల్ని పాతాళానికి తొక్కేయడమంటే.. అది అస్సలు సమర్థనీయం కాదు. కానీ, థియేటర్లను బతికిస్తున్నవి ఈ రీ-రిలీజులు మాత్రమే ఇటీవలి కాలంలో.
ఓటీటీ రిలీజులు కూడా..
శుక్రవారమే ఎందుకు ఓటీటీలో కొత్త సినిమాలు విడుదలవ్వాలి.? ఇదో బిగ్ క్వశ్చన్. శుక్రవారం కాకుండా మరో రోజు ఓటీటీ రిలీజులు పెట్టకుంటే బెటర్ కదా.? నిజమే మరి.!
కానీ, ఓటీటీ సినిమాలు కూడా శుక్రవారమే రిలీజ్ అవుతుంటాయి. సినిమాలే కాదు, వెబ్ సిరీస్‌లు కూడా. దాంతో, ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది.
Also Read: దీపిక పదుకొనే ‘ఆ తప్పు’ ఎప్పుడూ చేయలేదా.?
స్థాయితో సంబంధం లేకుండా, బిగ్ స్క్రీన్స్ కొనేస్తున్నారు జనాలు. ఇంట్లో పెద్ద టీవీ, సినిమా థియేటర్ని తలపిస్తోంది. ఇంటిల్లిపాదీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫీలవుతున్నారు.
సో, థియేటర్లకు వెళ్ళాలన్న ఆలోచన సగటు సినీ ప్రేక్షకుల్లో కలగడంలేదన్నది బహిరంగ రహస్యం.