Table of Contents
Wife Husband Deadly Thoughts.. అందరు మగవాళ్ళూ చెడ్డోళ్ళు కాదు.. అలానే, స్త్రీలంతా మంచోళ్ళూ కాదు.! మగాళ్ళలోనూ మంచోళ్ళుంటారు.. స్త్రీలలోనూ చెడ్డోళ్ళుంటారు.!
అసలు విషయానికొస్తే, ఇదో వార్తా కథనానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే సుమీ.! ఓ భార్య, పెళ్ళయిన పది రోజులకే పుట్టింటికి వెళ్ళింది. అట్నుంచటే, ప్రియుడితో పారిపోయింది.
భర్త ఏం చేయాలి.? కుమిలిపోయాడు, ఆ తర్వాత తేరుకున్నాడు. ‘హమ్మయ్యా.. బతికిపోయా..’ అని ధైర్యం తెచ్చుకున్నాడు.!
Wife Husband Deadly Thoughts.. చావు తప్పింది మరి..
నిజమే, ఆ భర్త తన ప్రాణాల్ని కాపాడుకోగలిగాడు.. లేదంటే, భార్య చేతిలో బలైపోయేవాడే.! తన భార్యకి వేరే వ్యక్తితో పరిచయం వుందన్న విషయం, పెళ్ళయ్యాక తెలిసింది ఆ భర్తకి.
సదరు ‘భార్య’, తన భర్తని చంపెయ్యడానికి, తన ప్రియుడి సాయం తీసుకుందిట. ఆ విషయం, భర్తకి కాస్త ముందుగానే తెలిసిపోయింది.
ఈ మధ్యనే ఓ భార్య, తన భర్తని హనీమూన్‌కి తీసుకెళ్ళి, తన ప్రియుడితో చంపించేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
విడాకులనే ఆప్షన్ వుంది కదా..
భార్యని చంపేసే భర్తలు, భర్తల్ని చంపేసే భార్యలు.. ఈ వార్తలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. నర రూప రాక్షసుల్లా వీళ్ళెలా తయారయిపోతున్నారో ఏమో.!
విడాకులనే ఆప్షన్ ఒకటి వుందన్న విషయమే ఎవరికీ తెలియడంలేదు.! పెళ్ళయిన మర్నాడే అయినా, విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు వుంది.
చంపేస్తే, సుఖం దొరుకుతుందా.? దొరకదు, జైలు పాలవ్వాల్సిందే.! భర్తల చేతిలో హతమవుతున్న భార్యలు.. భార్యల చేతిలో హతమవుతున్న భర్తలు.. నిత్యం ఇవే వార్తలు ఎక్కడ చూసినా.
చంపేసుకుంటే ఏమొస్తుంది.?
చావు భయంతో మనుషులు బతకాల్సిన దుస్థితి దాపురించింది. సజావుగా సాగుతున్న సంసారాలు లేవని ఎలా అనగలం.? కాకపోతే, క్రైమ్ రేట్ అనూహ్యంగా పెరిగిపోతోంది.
Also Read: OG vs Akhanda: పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య వెనక్కి తగ్గుతాడా?
కారణాలేంటని ఆరా తీస్తే, ఓటీటీ కంటెంట్.. సినిమాలు, టీవీ సీరియల్.. ఆపై సోషల్ మాడియా.. వాట్ నాట్.. బోల్డన్ని కారణాలున్నాయి.
అంతిమంగా, మనిషి బతికి వుంటేనే కదా.. ఏదైనా.? ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్సవుతున్నారో ఏమో.!