Table of Contents
Pawan Kalyan Sanathanam Allu.. చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గురించి, అల్లు అరవింద్ నుంచి వచ్చింది.
అదీ, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మం గురించి కావడం గమనార్హం.
ఇదిప్పుడు, అల్లు అర్జున్ అభిమానులుగా చెప్పుకుంటోన్న ఓ వర్గం ‘ఆర్మీ’లో ఆందోళనకు కారణమైంది.
అసలు, అల్లు అరవింద్ వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ ఆర్మీ ఎందుకు ఆందోళన చెందుతోంది.? అల్లు అరవింద్‌ని, ఆ ఆర్మీ ఎందుకు ట్రోల్ చేస్తోంది.?
ఇంతకీ, సనాతన ధర్మంపై అల్లు అర్జున్ అభిమానుల్లో ‘ఆర్మీ’గా చెప్పబడే ఓ వర్గానికి ఎందుకు అస్సలు పొసగడంలేదు.? ఇదిప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
Pawan Kalyan Sanathanam Allu.. పవన్ కళ్యాణ్ ఆ విషయంలో గొప్పోడు..
సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కి తెలిసినంతగా, మా కుటుంబంలో, బంధువుల్లో, సన్నిహితుల్లో ఎవరికీ తెలియదు.. అంటూ, అల్లు అరవింద్ స్టేట్మెంట్ పాస్ చేశారు.

‘మహావతార్’ సినిమా సక్సెస్ నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగునాట ‘మహావతార్’ని గీతా ఆర్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సినిమా సక్సెెస్ ఈవెంట్లో అల్లు అరవింద్, సనాతన దర్మం గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్‌ని ఎందుకు పొగిడారన్నది అర్థం కావడంలేదు, అల్లు అర్జున్ ఆర్మీకి.
పవన్ కళ్యాణ్ అంటేనే ఆ ఆర్మీకి మంట..
అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో కొందరు గత కొంతకాలంగా, పవన్ కళ్యాణ్‌నీ అలాగే మెగా కాంపౌండ్‌లో చిరంజీవి సహా అందర్నీ ట్రోల్ చేస్తూ వస్తున్నారు.
చిత్రమేంటంటే, ఆ ఆర్మీని అల్లు అర్జున్ వెనకేసుకొస్తున్నాడు. దాంతో, ఆ ఆర్మీ మరింతగా చెలరేగిపోతున్న వైనాన్ని చూస్తున్నాం.
మామూలుగా అయితే, ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అరవింద్ అసలు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించి వుండకూడదు. కానీ, ప్రస్తావించేశారు.
‘మహావతార్’ సినిమాని పవన్ కళ్యాణ్ చూస్తారా.?
సనాతన ధర్మం గురించి పెద్ద యుద్ధమే చేస్తున్న పవన్ కళ్యాణ్, తప్పక ‘మహావతార్’ సినిమా చూస్తారని ఆశిస్తున్నట్లు అల్లు అరవింద్ చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం.
నిజానికి, అల్లు అరవింద్ ‘మహావతార్’ సినిమా ఈవెంట్ సందర్భంగా, అల్లు అర్జున్ పేరుని ప్రస్తావించి వుండాలన్నది ‘ఆర్మీ’ ఉవాచ.
Also Read: Ronth Telugu Review: ఆ రాత్రి.. ఆ ఇద్దరు పోలీసులు ఏం చేశారు.?
అందుకే, ఆ మంటతోనే అల్లు అరవింద్‌ని కూడా అల్లు అర్జున్ ఆర్మీ ట్రోల్ చేస్తోంది. దిగజారుడుతనంలో అల్లు అర్జున్ ఆర్మీ తర్వాతేనని ఇప్పుడు ఇంకోసారి నిరూపితమయ్యిందంతే.
అల్లు అర్జున్ అభిమానులంతా ఇలాగే వుంటారని అనలేం. అందులో చాలామందికి, మెగా కాంపౌండ్ మీద ‘భక్తి’ వుంది.. అల్లు అర్జున్‌కి వున్నట్లే.
కానీ, అల్లు అర్జున్ ఆర్మీ వ్యవహారం వేరు.!