Home » అందగత్తె ఈ శూర్పణఖ.! రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ కెవ్వు కేక.!

అందగత్తె ఈ శూర్పణఖ.! రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ కెవ్వు కేక.!

by Mudra369 Editorial Desk
0 comments
Rakul Preet Singh

Shurpanakha Rakul Preet Singh.. అందం, అభినయంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తూ.. సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ట్రెండ్స్ ఫాలో చేస్తుంటుంది.

లేటెస్టుగా బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్.. రావణాసురుడి సోదరి శూర్పణఖ’ పాత్రలో నటిస్తోంది.

ఈ పాత్రలో నటించే ఛాన్స్ తనకు వచ్చినందుకు లక్కీ అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎందుకంటే శూర్పణఖ పాత్ర ఒకింత డిఫరెంట్‌గా వుంటుంది. నెగిటివ్ షేడ్స్‌తో కూడుకున్నది.

ఏకపత్నీవ్రతుడు అయిన రాముడిని మోహించే పాత్ర అది. సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెబుతోంది. అలాగే, శూర్పణఖ పాత్రకు జనంలో నెగిటివిటీ వున్నప్పటికీ.. శూర్పణఖ కూడా చాలా మంచిదే అని రకుల్ చెబుతోంది.

Shurpanakha Rakul Preet Singh.. ఒకే ఒక్క పాజిటివిటీ రకుల్ ప్రీత్ సింగ్.!

ఆమె పోషించిన పాత్ర కదా.! అయితే, సినిమా రిలీజ్ తర్వాత ఆ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిక. కానీ, ప్రమోషన్స్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

రకరకాల కారణాలతో రణ్‌బీర్, సాయి పల్లవి.. ట్రోల్ అవుతోంటే, ఈ సినిమాకి సంబంధించి ఓన్లీ పాజిటివ్ యాంగిల్ రకుల్ అయిపోయింది.

తాజా ప్రమోషన్స్‌లో భాగంగా ఆరెంజ్ కలర్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

Rakul Preet Singh
Rakul Preet Singh

‘బ్యూటిఫుల్ శూర్పణఖ’ అంటూ ఈ ఫోటోలకు కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఆరెంజ్ కలర్ ఈ హెవీ సీక్వెన్స్ శారీలో నిజంగానే శూర్పణఖ చాలా బ్యూటిఫుల్ అండ్ మోడ్రన్ ఎత్నిక్ లుక్స్‌తో కిల్ చేస్తోంది.

ఈ హై అండ్ ఎంబ్రాయిడరీ శారీకి ఆమె ధరించిన స్ట్రాపీ మోడ్రన్ డిజైనర్ బ్లౌజ్ చక్కగా సెట్ అయ్యింది. అలాగే, మెడలో సింపుల్‌గా కుందన్స్ పొదిగిన చోకర్ సెట్ రాయల్ లుక్ ఆపాదిస్తోంది.

బ్యూటిపుల్ బిజినెస్ విమెన్..

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా బోలెడన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు బాలీవుడ్‌లో రకుల్ హవా బాగా నడుస్తోంది.

Rakul Preet Singh
Rakul Preet Singh

ఓ వైపు సినిమాల్లో కెరీర్ విజయవంతంగా కొనసాగిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రకుల్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వెతుకుతుంటుంది.

ఆ నేపథ్యంలోనే ఫిట్‌నెస్ అండ్ హెల్త్ వెల్‌నెస్, అండ్ న్యూట్రిషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ విమెన్‌గానూ దూసుకెళ్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group