No Shave November Movember.. ‘నేను సింహం లాంటోడిని.. అది గెడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను.. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్’.
‘అత్తారింటికి దారేది’ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ చెప్తాడు ఈ డైలాగ్.
ఇప్పుడీ డైలాగ్ ఎందుకంటే, ‘నో షేవ్ నవంబర్’ అనేదొకటుంది.. దాని గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి.! ‘నో షేవ్ నంబర్’ గురించి మీలో చాలామందికి తెలిసే వుంటుంది.
నవంబర్ నెలలో గడ్డం గీసుకోకూడదు.! ఇదీ, ‘నో షేవ్ నంబర్’ కాన్సెప్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశ్యం.
ఎందుకు.? అంటే, గడ్డం గీసుకోకుండా వుండటం వల్ల మిగిల్చే మొత్తాన్ని, సేవా కార్యక్రమాలకి వినియోగిస్తారట.! అది కూడా, క్యాన్సర్ బాధితుల కోసం వినియోగిస్తారట.
No Shave November Movember.. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన..
క్యాన్సర్ బాధితుల కోసం వినియోగించడమే కాదు, క్యాన్సర్‌కి వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టడానికీ, ‘నో షేవ్ నవంబర్’తో సేవ్ చేసిన డబ్బుల్ని వినియోగిస్తుంటారు.
అమెరికా సహా, చాలా దేశాల్లో ఇప్పుడీ ‘నో షేవ్ నవంబర్’ అనే కాన్సెప్ట్ నడుస్తోంది.! అందరూ కాదు గానీ, కొందరు ప్రతియేటా నవంబర్‌లో గడ్డం షేవ్ చేసుకోరు.
అన్నట్టు, ‘మోవంబర్’ అనేదొరకటుంది. ఇది కూడా ‘నో షేవ్ నంబర్’లానే వుంటుంది. కాకపోతే, ఆస్ట్రేలియాలో ‘మీసాల్ని’ పెంచుతారు ‘మోవంబర్’ పేరుతో.
‘మోవంబర్’ కూడా, క్యాన్సర్ విషయమై అవగాహనా కార్యక్రమాలు చేపట్టడానికే. ఈ కార్యక్రమాలతో క్యాన్సర్ పట్ల పురుషుల్లో చైతన్యం పెరుగుతుందన్నది అంతటా వినిపించే అభిప్రాయం.
పురుషుల్లో ఎక్కువగా కనిపించే కొలన్ క్యాన్సర్ నేపథ్యంలో, ఈ ‘నో షేవ్ నవంబర్’ పుట్టుకొచ్చింది. అదీ, ‘నో షేవ్ నవంబర్’ కథా కమామిషు.!
బావుంది కదా.! మంచి పనుల కోసం చేసే, ఇలాంటి క్యాంపెయిన్స్కి మద్దతు కూడా సహజంగానే చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.