Jagan Sharmila Family Politics.. రాజకీయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ.. వీటితో ‘వైరం’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు.
కానీ, తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డితో రాజకీయ వైరమే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది.!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమవుతోందో లేదోగానీ.. వైసీపీ, 2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూడ్డానికి, వైఎస్ షర్మిల కూడా పరోక్షంగా కారణం.
వైఎస్ షర్మిల కట్టుకున్న పసుపు రంగు చీర మీద అప్పట్లో వైఎస్ జగన్, ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు.. వైసీపీని చాలా చాలా దెబ్బ తీశాయి.
Jagan Sharmila Family Politics.. కుంపటి రాజేసిందెవరు.?
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో వైఎస్ జగన్ ఆస్తుల పంచాయితీ కూడా, వైసీపీని రాజకీయంగా దారుణమైన దెబ్బ తీశాయన్నది కాదనలేని వాస్తవం.
నిజానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పట్లో రైట్ హ్యాండ్‌గా వున్న విజయ సాయి రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గాకనే పరిస్థితులు ఇలా తగలడ్డాయని వైసీపీ అభిమానులు అంటుంటారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రాబల్యం వైసీపీలో పెరగడమంటే, అది విజయ సాయి రెడ్డి ప్రాబల్యం తగ్గడమే. వైఎస్ కుటుంబంతో నేరుగా అత్యంత సన్నిహిత సంబంధాలు విజయసాయిరెడ్డికే వుండేవి.
షర్మిల వైసీపీకి దూరమవడం, వైసీపీ నుంచి విజయమ్మ బయటకు వెళ్ళడం.. ఇవన్నీ సజ్జల వల్లే జరిగాయనే కామెంట్లు వైసీపీలోనే వినిపిస్తుంటాయి.
తాజాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘రాజకీయ వ్యభిచారి’ అనేశారు వైఎస్ షర్మిల. ఇది చాలా దారుణమైన కామెంట్. అన్న జగన్‌ని ఉద్దేశించి, చెల్లెలు షర్మిల ఎలా అలా కామెంట్ చేయగలిగినట్లు.?
షర్మిల కాంగ్రెస్ నేత (ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు), వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాజకీయ వైరం ఎంత వున్నా, ఇలాంటి వ్యాఖ్యలు షర్మిల చేయడం.. ఒకింత అభ్యంతకరమే.
కానీ, విజయమ్మ క్యారెక్టర్ పైనా.. అలానే షర్మిల పైనా.. వైసీపీ నేతలతో ఇంతకంటే హీనమైన కామెంట్లు వైఎస్ జగన్ చేయించారు. ఈ క్రమంలో షర్మిల ఎదురుతిరిగినట్లు కనిపిస్తోంది.
Also Read: ‘పరదా’ రివ్యూ.! ఆంక్షల పరదా తొలగించే ప్రయత్నమేగానీ.!
విజయమ్మ కూడా, ఆస్తుల పంపకాల విషయమై తాజాగా, కోర్టును ఆశ్రయించిన వ్యవహారం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఆస్తుల పంపకాల గొడవెలా వున్నా, వైఎస్ జగన్‌తో అప్పుడప్పుడూ విజయమ్మ కలిసి కనిపిస్తున్నారు. కానీ, వైఎస్ షర్మిల వ్యవహారం వేరు.!
మొన్నటి ఎన్నికల్లో వైఎస్ షర్మిల గెలిచి వుంటే, వైఎస్ జగన్ పరిస్థితి మరింత దారుణంగా వుండేదేమో.! కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగా ప్రయత్నంచి వైఎస్ షర్మిలను ఏదో ఒక కోటాలో రాజ్యసభకు పంపితే.. ఇక అంతే సంగతులు.