Allu Aravind Status.. ఆయన మెగా నిర్మాత.. తెలుగు సినీ పరిశ్రమలో.! పరిచయం అక్కర్లేని ‘పెద్దరికం’ ఆయన సొంతం.! ఇప్పుడైతే, స్వయంగా సినిమాలు తీయడానికి వెనుకాడుతున్నారు.
కాకపోతే, సమర్పకుడిగా పలు సినిమాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.
బన్నీ వాస్, ఎస్‌కేఎన్.. ఇలా పలువురు నిర్మాతలు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘బినామీలు’ అన్న విమర్శ వుందనుకోండి.. అది వేరే సంగతి.
గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తీయాలన్నది అల్లు అరవింద్ కోరిక.
మేనల్లుడితో, కొడుకుతో కలిసి.. సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకోవడం బాగానే వుందిగానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంలేదు.
సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులు పరస్పరం దూషించుకుంటూ, వీళ్ళు వాళ్ళ హీరోని, వాళ్ళు వీళ్ళ హీరోనీ ట్రోల్ చేస్తుండడం చూస్తున్నాం.
మరి, పెద్దన్న పాత్ర పోషించి.. ఇరువురి అభిమానులకీ అల్లు అరవింద్ ఓ మంచి మెసేజ్ ఇవ్వాలి కదా.? ఇవ్వడంలేదాయె.!
Allu Aravind Status.. స్థాయి ఎవరిది.? ఎంత.?
సరే, ఆ సంగతి పక్కన పెడదాం. తాజాగా, ఓ సినిమా ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్, ‘స్థాయి’ గురించి మాట్లాడారు. ‘సమాధానం చెప్పడానికి నాకు ఓ స్థాయి వుంది’ అన్నారాయన.
ప్రశ్న ఏంటంటే, ‘బండ్ల గణేష్ మీ గురించి కామెంట్ చేశారు కదా.. చివర్లో వచ్చి, సినిమాల క్రెడిట్ కొట్టేస్తుంటారట కదా మీరు..’ అని.
ఓ సినీ ఎర్నలిస్ట్, నిర్మాతని ‘పోక్’ చేసే ఉద్దేశ్యంతో సంధించిన ప్రశ్న అది. ఈ క్రమంలో, సమాధానం చెప్పడం ఇష్టం లేక, ‘స్థాయి’ గురించి ప్రస్తావించారు అల్లు అరవింద్.
Also Read: ప్రియాంక చోప్రా జోనాస్.. రెమ్యునరేషన్ ఎంత.?
ఇంతకీ, ‘స్థాయి’ ఏంటి.? ఎవరికి స్థాయి లేదని అల్లు అరవింద్ వ్యాఖ్యానించినట్లు.? ప్రశ్న అడిగిన సినీ ఎర్నలిస్టుకి అయితే స్థాయి లేదు.! ఈ మధ్యనే, మంచు లక్ష్మితో చీవాట్లు తిన్నాడు ఆ సినీ ఎర్నలిస్ట్.
ఆ మధ్య, సినీ నటి స్వాతి రెడ్డితోనూ చీవాట్లు తిన్న ఘనత ఆ సినీ ఎర్నలిస్టుదే. సినీ ఎర్నలిస్టు గురించేనా, అల్లు అరవింద్ ‘స్థాయి’ ప్రస్తావన తెచ్చింది.?
లేదంటే, తన స్థాయికి తగ్గి, బండ్ల గణేష్ మీద వ్యాఖ్యానించను.. అని అల్లు అరవింద్ చెప్పదలచుకున్నారా.?
బండ్ల గణేష్, ఇటీవలే ఓ యంగ్ హీరో గురించి మాట్లాడుతూ, ‘అల్లు అర్జున్ స్థాయికి వెళతాడు’ అని అన్నాడు. సో, బండ్ల విషయంలో అల్లు అరవింద్, ‘స్థాయి’ గురించి మాట్లాడే అవకాశం లేదు.
