Hey Balwanth Review.. వ్యభిచారాన్ని సామాజిక దురాచారం అనాలా.? నేరం.. అనాలా.? నో డౌట్, వ్యభిచారం నేరమే.! చట్టాలు అవే చెబుతున్నాయి.!
కానీ, వ్యభిచారాన్ని ఘనకార్యంగా చూపించే ప్రయత్నం ‘హే బల్వంత్’ సినిమాతో దర్శక నిర్మాతలు, నటీనటులు చేశారు.! సుహాస్ హీరోగా నటించిన చిత్రమిది.
శివాని నగరం ఈ ‘హే బల్వంత్’ సినిమాలో హీరోయిన్. సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి అన్నపూర్ణ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
సినిమాలో ప్రమోషన్స్ చిత్ర విచిత్రంగా చేశారు. కాస్తంత ఫన్ క్రియేట్ అయ్యింది ప్రోమోస్‌తోనే. అదే సమయంలో, ఒకింత ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయగలిగారు ఆడియన్స్‌లో సినిమా పట్ల.
Hey Balwanth Review.. ‘హే బల్వంత్’ సినిమా కథేంటి.?
తండ్రిలానే బిజినెస్ మేన్ అయిపోవాలనుకుంటాడో కొడుకు. కానీ, తండ్రి ఏం బిజినెస్ చేస్తాడన్నది తెలియదు. తెలిశాక షాక్ అవుతాడు.
థియేటర్లలోకి సినిమా వచ్చి చాలాకాలమే అయ్యింది. ఓటీటీలోకీ వచ్చేసింది గనుక, సస్పెన్స్ అనవసరం. తండ్రి ఓ లాడ్జ్ నడుపుతుంటాడు. దాంట్లో, అసాంఘీక కార్యకలాపాలు నడుస్తుంటాయ్.
సరిగ్గా చెప్పాలంటే, వ్యభిచార కార్యకలాపాలు జరుగుతుంటాయ్ ఆ లాడ్జిలో. విషయం తెలిసి, కొడుకు షాక్ అవుతాడు.
కథని ఎలాక్కావాలంటే, అలా తిప్పేసుకున్నాడు దర్శకుడు. ముగింపు ఇవ్వాలి గనుక, కోరుకున్న ముగింపు ఇచ్చేశాడు. అసాంఘీక కార్యకలాపాలు నడిపే లాడ్జి ఓనర్ ఈ సినిమా హీరో.
అతనెంత మంచోడంటే, అతని వల్ల ఓ కుర్రాడు పోలీస్ అధికారిగా ఎదుగుతాడు. అర్థమయ్యిందా రాజా.? అర్థమవకుండా ఎలా వుంటుంది.?
చేసిందే క్రైమ్.. ఆ క్రైమ్ లోంచి ఓ పోలీస్ అధికారి పుట్టుకొచ్చాడు. సభ్య సమాజానికి దర్శక నిర్మాతలు ఏం సంకేతాలు పంపినట్లు.? నటీనటులు ఏం నమ్మి, ఈ సినిమా చేసినట్లు.?
కామెడీ కోసమే అయితే, కామెడీ సీన్స్‌తో సరిపెట్టొచ్చు.. తప్పేమీ కాదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. కథకు ముగింపు ఇస్తూ, సభ్య సమాజానికి అసభ్య సందేశం ఇవ్వడమేంటి ఛండాలం కాకపోతే.?
Also Read: లెహెంగా ఖరీదు లచ్చ.! చీప్ అండ్ బెస్టేగా.!?
నరేష్ పాత్ర ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు.? క్రైమ్ వెనుక కూడా, ఓ గొప్ప మానవత్వం వుంటుంది కాబట్టి, క్రిమినల్‌ని వదిలెయ్యాలని చెబుతున్నాడా.?
ఇక, హీరోయిన్‌ని తెలిసీ, వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిలోకి హీరో తీసుకెళతాడు. అక్కడ హీరోయిన్‌కి ఆమె తాత కనిపిస్తాడు. అసలిలా ఎలా తీశారో సినిమాని దర్శక నిర్మాతలు.?
దాదాపుగా నటీనటులెవరి నటనా ప్రతిభ గురించీ మాట్లాడుకోవడానికి లేదు. అనవసరం అంతే.! నరేష్, అన్నపూర్ణ.. లాంటి సీనియర్లు చేయాల్సిన సినిమా కాదు.
సుహాస్ మంచి నటుడు.. ప్చ్, రాంగ్ ఛాయిస్. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న యువ నటి శివానీ నగరం, ఈ తరహా కథలకు దూరంగా వుంటే మంచిది.
