Table of Contents
Pawan Kalyan Johnny Review.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జానీ’ సినిమా గుర్తుందా.? అలా ఎలా మర్చిపోగలం.?
ఏదన్నా డిజాస్టర్ సినిమా గురించి మాట్లాడాలంటే, ముందుగా ‘జానీ’ సినిమానే ప్రస్తావిస్తారు చాలామంది.
అప్పటిదాకా పవన్ కళ్యాణ్ వేరు, ‘జానీ’ సినిమాతో పవన్ కళ్యాణ్ వేరు. ‘జానీ’ సినిమాకి పవన్ కళ్యాణే దర్శకుడు కూడా.
రేణు దేశాయ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రమణ గోగుల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Pawan Kalyan Johnny Review.. మ్యూజిక్, యాక్షన్.. దేనికదే..
‘జానీ’ సినిమాకి డబ్బింగ్ వెరైటీగా చెప్పించారు. అదే సినిమాకి పెద్ద మైనస్.! మ్యూజిక్ మాత్రం, ఎవర్ గ్రీన్.! ఎన్నేళ్ళయినా, ‘జానీ’ సినిమాలోని పాటలకు తిరుగు లేదు.!
యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాలో ఇంకో హైలైట్. పాటలు వినడానికే కాదు, చూడ్డానికి కూడా చాలా బావుంటాయ్. కొన్ని సీన్స్ మేకింగ్ అయితే అల్టిమేట్.
పార్టులు పార్టులుగా చూస్తే, ఇది కూడా బానే వుంటుంది.. అని ఓ సినిమాలో డైలాగుంటుంది. ‘జానీ’ సినిమా కూడా అలాంటిదే.
చాలా ప్రత్యేకతలున్నాయి ‘జానీ’ సినిమాకి సంబంధించి. పవన్ కళ్యాణ్ పాటలు కూడా పాడారు. అంతేనా, రేణు దేశాయ్ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్స్ సహా, పలు విభాగాల్లో సహాయ సహకారాలు అందించారు.
ఇప్పుడెందుకీ చర్చ..
ఇప్పుడెందుకు, ‘జానీ’ సినిమా గురించిన డిస్కషన్.. అంటే, రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది కదా.! అందుకే.! ‘జానీ’ సినిమా గురించి కొత్తగా రివ్యూలు షురూ అయ్యాయి.
నిన్న మొన్నటిదాకా ‘జానీ’ సినిమాని తూలనాడిన వాళ్ళే, ఇప్పుడు ఆ సినిమా గొప్పతనం గురించి చెబుతున్నారు. చిన్న చిన్న లోపాల్ని మినహాయిస్తే, టెక్నికల్‌గా వెల్ సౌండ్ సినిమా.. అంటున్నారు.
టెక్నీషియన్‌గా పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో విజయం సాధించారీ సినిమాతో.. అంటూ, విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఇదో ట్విస్టు మళ్ళీ.!
చిన్న చిన్న మార్పులు చేసి, సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి వుంటే.. అంటూ దీర్ఘాలు తీస్తున్నారు చాలామంది. నిజమే, సినిమాలో కొంత నీరసం వుంటుంది.
నీరసమేగానీ..
ఆ నీరసమే, ‘జానీ’ సినిమాకి కోలుకోలేని దెబ్బ కొట్టింది. సినిమాపై అప్పట్లో ఏర్పడ్డ అంచనాలూ, సినిమా పరాజయానికి కారణం.
ఎవరు ఏమనుకున్నా, ‘జానీ’ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరికి చాలా చాలా మెమరబుల్ ఫిలిం.. పాజిటివ్ యాంగిల్లో.!
ఇన్నేళ్ళ తర్వాత కూడా ‘జానీ’ గురించి గొప్పగా మీడియా మాట్లాడుతోందంటే.. ఇది కదా, అసలు సిసలు విజయం అంటే.!!
అప్పట్లో డిజాస్టర్.. ఇప్పుడేమో, సూపర్ హిట్.! ఇలాంటిదే, ఇంకో సినిమా వుంది. అదేంటో తెలుసు కదా.. ‘ఆరెంజ్’.! రామ్ చరణ్ కెరీర్లో చాలా పెద్ద డిజాస్టర్ ఇది.
కానీ, ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా సంచలన రీతిలో వసూళ్ళను కొల్లగొట్టింది.! ‘ఆరెంజ్’ కూడా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్.!
