Wamiqa Gabbi DC Movie.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన సినిమా ‘డీసీ’. ఇందులో ‘చంద్ర’ పాత్రలో మెరిసింది వామిక గబ్బి.! సినిమా పెద్ద హిట్ అయ్యింది. వసూళ్ళ పంట పండింది.
‘డీసీ’ చిత్ర దర్శకుడికీ, ‘డీసీ’ హీరోకీ, ‘డీసీ’ సంగీత దర్శకుడికి కూడా ఖరీదైన బహుమతులు లభించాయి సినిమా హిట్టయిన నేపథ్యంలో.
అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను నిర్మాణ సంస్థ, హీరోకి అలానే దర్శకుడికి, సంగీత దర్శకుడికి అందించడం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి, దేశవ్యాప్తంగా ఈ ఖరీదైన లగ్జరీ కార్ల బహుమతుల అంశం చర్చనీయాంశంగా మారుతోంది. హీరోకి ఇచ్చారు.. సంగీత దర్శకుడికీ, దర్శకుడికి కూడా ఖరీదైన కార్లు ఇచ్చారు.. బానే వుంది.
కానీ, హీరోయిన్ వామిక గబ్బికి ఎందుకు ఖరీదైన కారు కాకపోయినా, ఓ మామూలు కారు అయినా బహుమతిగా నిర్మాణ సంస్థ ఇవ్వలేదబ్బా.? ఇదీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలోనూ ఈ కార్ల బహుమతుల గురించి వింటుంటాం. ‘ఓజీ’ సినిమా హిట్టయ్యాక దర్శకుడు సుజీత్‌కి హీరో పినవ్ కళ్యాణ్ అత్యంత ఖరీదైన కారుని కొనిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ట్రెండ్ బహుశా ఎక్కువగా తెలుగు సినీ పరిశ్రమలోనే కనిపిస్తుంటుందేమో. తమిళ సినీ పరిశ్రమలోనూ అడపా దడపా చూస్తుంటాం.
అయితే, ఎక్కడా హీరోయిన్లకు లగ్జరీ కార్లు బహుమతులుగా అందడం కనిపించదు. కారణమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
మిగతా సినిమాల వ్యవహారాల సంగతెలా వున్నా, ‘డీసీ’ సినిమా విజయం విషయంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడితోపాటు, హీరోయిన్ కూడా కీలక పాత్ర పోషించింది.
వామిక స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె నటనా ప్రతిభ.. ‘డీసీ’ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అందుకే, వామిక గబ్బి కూడా అర్హురాలే, లగ్జరీ కారుని బహుమతిగా పొందేందుకు.!
పెద్దగా స్టార్‌డమ్ లేదు గనుక, వామిక రెమ్యునరేషన్ కూడా తక్కువే వుండి వుండాలి. అలాంటప్పుడు, కారుని బహుమతిగా ఇచ్చి వుంటే బావుండేది కదా.!
