Joseph Vijay Ajithkumar Trisha.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, యూకే వెళ్ళారు. యూకేలోనే తమిళ నటుడు అజిత్ కుమార్, రేసింగ్ పోటీల్లో బిజీగా వున్నాడు.
ఓ వైపు విజయ్ అభిమానులు, ఇంకో వైపు అజిత్ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా నిత్యం గొడవ పడుతూనే వుంటారు. జుగుప్సాకరంగా ట్రోలింగ్ నడుస్తుంటుంది.
కానీ, ఇటు విజయ్ కావొచ్చు.. అటు అజిత్ కావొచ్చు.. ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడలేదు. మొన్నీమధ్యనే అజిత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంటే, సీఎం విజయ్ వెళ్ళారు.. అజిత్‌ని పరామర్శించి వచ్చారు.
తాజాగా, అజిత్‌ని యూకేలో రేసింగ్ ఈవెంట్‌లో చూసి.. సరదాగా, సినిమాటిక్‌గా ఫన్ మోడ్‌లో వెళ్ళిలి కలిశారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అటు విజయ్ అభిమానులు, ఇటు అజిత్ అభిమానులూ.. ఈ ఫొటోలు, వీడియోలు చూసి మురిసిపోతున్నారు.

ఇప్పటిదాకా సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానుల మధ్యన జరిగిన ట్రోలింగ్ స్థానంలో, ఇరువురు అభిమానుల మధ్యనా సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, రేసింగ్‌ని సీఎం విజయ్ ఆసక్తికరంగా తిలకిస్తున్న సమయంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చి, సందడి చేయబోయింది త్రిష.
‘ఇక్కడ కూడానా.?’ అంటూ విజయ్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. విజయ్‌కి త్రిష మంచి స్నేహితురాలు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష, టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ, ఆమె రాజకీయాల్లోకి రాలేదు.
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక, త్రిష డిప్యూటీ సీఎం అవుతుందనే గుసగుసలూ వినిపించాయి. కానీ, విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో త్రిష చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
మొత్తమ్మీద విజయ్ – అజిత్ మధ్య స్నేహ సంబంధాల గురించిన పాజిటివ్ చర్చలు ఓ వైపు, త్రిష చేసిన హడావిడి నేపథ్యంలో విమర్శలు ఓ వైపు.. వెరసి, తమిళనాడు సినీ రాజకీయాలు మళ్ళీ హీటెక్కాయ్.
