Raviteja Nakshathra Irumudi Controversy.. రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’.! విడుదలకు సిద్ధమైంది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో కథానాయిక.
ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆమె పేరు నక్షత్ర. తండ్రి పాత్రలో రవితేజ, అతనికి కుమార్తెగా నక్షత్ర నటిస్తున్నారు ‘ఇరుముడి’ సినిమాలో.!
‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ చూస్తే, ఇదేదో అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమా.. అని అనిపించింది చాలామందికి. కానీ, ఇదొక ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్.. అని దర్శకుడు శివ నిర్వాణ అంటున్నాడు.
సినిమా ప్రమోషన్స్ చాలా చాలా గట్టిగానే చేశారు. అలాంటి ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో రవితేజ సహా, ఇంకో నటుడు కూడా మాట మీద అదుపు కోల్పోయాడు.
సరే, ఆ నటుడి సంగతి పక్కన పెడదాం. మాస్ మహరాజ్ రవితేజకి ఏమైంది.? బాధ్యతగా వుండక్కర్లేదా.? కూతురి పాత్రలో నటిస్తున్న నక్షత్ర మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలెలా చేశాడు.?
Raviteja Nakshathra Irumudi Controversy.. ఇదేం దిక్కుమాలిన నిక్ నేమ్.?
‘నాకు నిక్ నేమ్ పెట్టాల్సి వస్తే, ఏం పెడతారు..’ అని రవితేజని అడిగింది నక్షత్ర. దానికి, రవితేజ సమాధానమేంటో తెలుసా.?
‘ముదురు ముండ’ అని.! రాయడానికే అసహ్యంగా అనిపించింది. కానీ, ఈ మాటని చాలా తేలిగ్గా అనేశాడు రవితేజ.. అస్సలేమాత్రం తడుముకోకుండా.
ఓ సినిమాలో హీరోయిన్‌ని ఉద్దేశించి పదే పదే, ఈ ‘ముండ’ అనే మాట ఉపయోగిస్తాడు రవితేజ. ఆ కాంప్లిమెంట తీసుకున్నది ఎవరో కాదు నయనతార.
అప్పట్లో, రవితేజ మీద దారుణమైన విమర్శలు వచ్చాయి. వస్తాయ్ మరి.. ఆ పద ప్రయోగం అంత అసభ్యకరంగా వుంటుంది మరి.!
చిన్న పిల్ల నక్షత్ర మీద.. అదీ, కూతురి పాత్రలో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ మీద ‘ముండ’ అనడం రవితేజ కుసంస్కారానికి నిదర్శనమన్న చర్చ అంతటా జరుగుతోంది.
అన్నట్టు, రవితేజ సమాధానం విన్న నక్షత్ర, ‘మీరన్నమాట తాలూకు అర్థం నాకు తెలియదుగానీ..’ అంటూ, తన పని తాను కొనసాగించింది వేదికపై.
జనం అసహ్యించుకుంటున్నారు రవితేజ తీరుపై. కానీ, ఇప్పటికీ రవితేజ నుంచి ఎలాంటి క్షమాపణ రాలేదు.! ఇదేం పద్ధతి.?
మాస్ మహరాజ్ అనే ‘గుర్తింపు’ రవితేజకి వుంటే వుండొచ్చుగాక.! కానీ, ముందు తాను మనిషినన్న విషయాన్ని రవితేజ గుర్తెరిగితే మంచిది.!
