Rakul Naughty Preet Singh.. కొంతమంది నటులకి కొన్ని కొన్ని పాత్రలు వారి కెరీర్‌లో బెస్ట్ ఐడెంటిటీనిస్తుంటాయ్.
అలా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌కి ‘శూర్పణఖ’ పాత్ర.. ఓ స్పెషల్ గుర్తింపు ఇచ్చిందని చెప్పొచ్చు.
‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర పోషించిన సాయి పల్లవి కన్నా.. చిన్నదే అయినా శూర్పణఖ పాత్ర పోషించిన రకుల్‌కి ఎక్కువ గుర్తింపు దక్కింది. ప్రమోషన్లలోనూ రకుల్‌దే హవా.!
రకుల్ ఎక్కడ కనిపించినా ‘శూర్పణఖ’ ప్రస్థావన వస్తోంది. అంతలా రకుల్‌కి ఈ పాత్ర ప్రభావితం చేసింది. ఆల్రెడీ రకుల్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు తెలుగులో. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

కానీ, వాటన్నింట్లోకెల్లా ‘శూర్పణఖ’ పాత్ర ఆమెకు సరికొత్త గుర్తింపు తెచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. ఆ సంగతి అటుంచితే.. రకుల్ ప్రస్తుతం చాలా బిజీ.
ఓ వైపు సినిమాలూ, మరోవైపు మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటో సెషన్స్.. మరోవైపు కమర్షియల్ యాడ్స్.. ఇలా నాలుగు చేతులా సంపాదిస్తోంది.
అయినా కానీ, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. తాజాగా రకుల్ ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
Rakul Naughty Preet Singh.. కన్ను కొట్టి కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టి.!
ఈ ఫోటోస్‌లో రకుల్ నాటీ పోజులే హైలైట్. కొంటె పిల్లలా అల్లరి చేస్తూ కెమెరాకి పోజిచ్చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
రెడ్, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్‌లో స్ట్రాప్‌లెస్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ డ్రస్‌లో రకుల్ డిఫరెంట్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
డ్రస్, కాన్సెప్ట్ ఎలా వున్నా.. ఈ ఫ్రేమ్స్‌కి మెయిన్ హైలైట్ రకుల్ ఎక్స్ప్రెషన్సే. కన్ను కొట్టి కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టించేలా వున్నాయ్ రకుల్ ఈ నాటీ పోజుల్.

గ్లామర్‌కి కొంటెతనం యాడ్ అయితే, అది ఇంకెంత అందంగా వుంటుందో ఈ ఫోటో పోజులతో ప్రూవ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
ఈ పోజులకు ‘నాటీ వింక్ శూర్పణఖ’ అంటూ నెటిజనం కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అలాగే, రకుల్ నాటీ లుక్స్‌కి మస్త్ మజా ఫీలవుతున్నారు.