Table of Contents
Chandrababu Sharmila Sakshi Jagan.. ‘చెట్టపట్టాల్’ ఒకటే పదమా.? ‘చెట్టా పట్టాలు’ అని, రెండు పదాలుగా కదా రాస్తాం.? ఇంతకీ, ఈ ‘చెట్టపట్టాల్’ లేదా ‘చెట్టా పట్టాలు’ అంటే ఏంటి.?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడీ ‘చెట్టపట్టాల్’ లేదా ‘చెట్టా పట్టాలు’ ఎందుకు ఇంత వివాదాస్పదమవుతోంది.? దీన్ని నిషేధిత పదాల జాబితాలోకి చేర్చేద్దామా.?
‘ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా’ అని భక్త రామదాసు అంటే, అది స్వామి భక్తి.! ఆ శ్రీరాముడి పట్ల అపారమైన భక్తి కలిగిన ‘రామదాసు’ ఆవేదనాభరితంగా అన్నమాటలవి.
కానీ, ఇదే మాటని ‘ఎవడబ్బ సొమ్మనీ..’ అంటూ ఎవరి మీదన్నా గట్టిగా ఆరిచామంటే, గూబగుయ్యిమనిపోతుంది మనకే.!
తెలుగు భాషలోని అందమే అది.! దేన్ని, ఎక్కడ ఎంతలా వాడాలో అంతే వాడాలి.! తేడా వస్తే, కొంపలు అంటుకుపోతాయ్.!
Chandrababu Sharmila Sakshi Jagan.. షర్మిలపై జుగుప్సాకర పద ప్రయోగం.. కుట్ర పూరితమే.!
సాక్షి దిన పత్రికలో ‘చెట్టపట్టాల్’ అనే ప్రస్తావన చేశారు చంద్రబాబు – షర్మిల మీద సంయుక్తంగా.! అదే, ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ఏదన్నా, రాజకీయ పరమైన అంశం మీద, ఇరు పార్టీల అధినేతలూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో, ఓ సమస్యపై ఇరువురూ కలిసి పోరాటం చేస్తున్నపుడు ‘చెట్టాపట్టాల్’ అనడం కొంతవరరకు సబబు.!
కానీ, తన కుమార్తె పెళ్ళికి ముఖ్యమంత్రిని వైఎస్ షర్మిల అనే కాంగ్రెస్ నేత మర్యాదపూర్వకంగా కలిసి, వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానిస్తే, ‘చెట్టపట్టాల్’ అంటూ వార్త రాయడమేంటి.?
రాసినోళ్ళకి, మనసులో ఎంత కుళ్ళు, కుట్ర, కుతంత్రం.. వుండి వుండాలి.. ‘చెట్టపట్టాల్’ అని రాయడానికి.?
వేరే వాళ్ళయితే తగలబెట్టేయడం ఖాయం..
జగన్ – షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ళుగా ప్రేమానుబంధాలు బలంగా వుండి వుంటే.. వేరే పత్రికలో ఇలాంటి హెడ్డింగ్‌తో వార్తే, ఈ పాటికి ఆ పత్రిక కార్యాలయాన్ని వైసీపీ నేతలు తగలబెట్టేసేవారే.
సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి, సాక్షాత్తూ తన సోదరి మీదనే వైఎస్ జగన్ రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు కాబట్టే, సాక్షి మీడియా ఇంతలా చెలరేగిపోయింది.. దిగజారిపోయింది.
సాక్షి అంటే, వైసీపీ సొంత పత్రిక. కానీ, అందులో పని చేసేది వేరే వ్యక్తులు కదా.! ఆ వ్యక్తులకు, ఆ స్థాయి స్వేచ్ఛ వచ్చేది మళ్ళీ పత్రిక యాజమాన్యం వల్లనే కదా.!
తప్పు జరిగిపోయింది.! నిజంగానే ఘోరమైన తప్పిదమిది.! అత్యంత దిగజారుడుతనంతో కూడిన వార్త ఇది.! వున్నపళంగా, సాక్షి యాజమాన్యం, షర్మిలకు క్షమాపణ చెప్పి వుండాల్సింది.
‘అక్రమ సంబంధాల్ని అంటగడతారా.?’ అంటూ వైఎస్ షర్మిల ఈ ‘చెట్టపట్టాల్’ వార్తపై స్పందించిన తర్వాత అయినా, సాక్షి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగి వుండాలి.
ఏదీ జగన్‌లో ఆ హుందాతనం.?
‘అలా ఎలా రాస్తారు.?’ అంటూ, వైఎస్ జగన్ ఆ రాత రాసిన వాళ్ళపై, దాన్ని ఆమోదించినవాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన అయినా చేసి వుండాల్సింది.
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలుగు దేశం పార్టీ అధినేత అలానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చద్రబాబునాయుడు.. ఇద్దరూ రాజకీయంగా ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తులే.
ఆ సంగతి సాక్షికి తెలియదా.? వైసీపీకి తెలియదా.? తెలిసీ ఇంకా బుకాయింపులెందుకు.? ‘చెట్టపట్టాల్’ అంటే, అర్థం ఇదీ.. అంటూ మేకపోతు గాంభీర్యమెందుకు.?
చెట్టపట్టాల్ అంటే, మంచి అర్థమూ వుంది.. చెడు అర్థమూ వుంది.! చెడు అర్థమే జనాల్లోకి వెళ్ళింది.! వేరే మార్గం లేదు, సాక్షికీ వైసీపీకీ.. వైఎస్ జగన్ మోహన రెడ్డికీ.! క్షమాపణ చెప్పి తీరాల్సిందే.