Ys Jagan Closed Eyes.. ‘కళ్ళు మూసుకుంటే, రెండేళ్ళు గడిచిపోయాయ్.. మూడో సంవత్సరంలోకి వచ్చేశాం.. ఇంకో ఏడాదిలో ఎటూ నా పాదయాత్ర మొదలైపోతుంది..’ ఇదీ తాజాగా వైఎస్ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్య.
నిజమే, కళ్ళు మూసి తెరిస్తే.. రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతాయ్.! ఏ పనీ చెయ్యకపోతే, అదే పరిస్థితి. పనులు చూసుకుంటూ పోయినా అంతే.!
కాలం ఎవరి కోసమూ ఆగదు.! సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంతే.! ఓ రాజకీయ పార్టీకి అధినేతగా, ‘కళ్ళు మూసుకుని, తెరిచే సరికి..’ అంటూ వైఎస్ జగన్ పదే పదే వ్యాఖ్యానించకూడదు.
2024 ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత, తాడేపల్లి నుంచి బెంగళూరుకి మకాం మార్చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అప్పుడప్పుడూ, బెంగళూరు నుంచి, తాడేపల్లికి వస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే సంత నియోజకవర్గం పులివెందులకు వైఎస్ జగన్ వెళుతున్న సంగతి తెలిసిందే.
Ys Jagan Closed Eyes.. పులివెందుల ఎమ్మెల్యే అయి వుండీ…
పులివెందుల ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి హాజరయ్యేందుకూ ఇష్టపడని వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు ‘కళ్ళు మూసుకుని తెరిచే సరికి..’ అంటూ ఉపన్యాసాలు మాత్రం ఇస్తున్నారు.
ఎవరు కళ్లు మూసుకోవాలి.? ఎందుకు కళ్ళు మూసుకోవాలి.? రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోనే వుండాలి. అదే రాజకీయమంటే.!
పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోనే వుండాలి. నాయకులతో వుండాలి, కార్యకర్తలకూ అందుబాటులో వుండాలి.
స్థానిక ఎన్నికలొస్తున్నాయ్.. పోరాడండీ.. యుద్ధం చేయండీ.. అని జగన్ పిలుపునివ్వడం మంచిదే. కానీ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, ‘ఇక్కడే వుంటాను..’ అని మాత్రం చెప్పలేకపోయారు.
కళ్ళు మూసుకుని తెరిస్తే..
కళ్ళు మూసుకుని తెరిచే సరికి 2029 ఎన్నికలు వచ్చేస్తాయ్.. నిజమే, ఇంకాస్త కళ్ళు మూసుకుంటే, 2029 కూడా దాటేసి, 2034 కూడా వచ్చేస్తుంది.!
ఇదే విషయాన్ని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు తమలో తాము. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లనే వున్నారు కదా.? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.
అయితే, అప్పటికి హైద్రాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా వుండేది. అది కూడా సాటి తెలుగు రాష్ట్రంలోనే వుంది. బెంగళూరు వ్యవహారం వేరు. అది వేరే వ్యవహారం.!
ఎవరు స్క్రిప్టు ఇస్తున్నారోగానీ, ఆ స్క్రిప్టులో ‘కళ్ళు మూసి తెరిచే సరికి..’ అన్న డైలాగ్‌ని ఇకపై రాకుండా చూడాల్సి వుంది. లేకపోతే, ఇదొక రొటీన్ రొట్టకొట్టుడు డైలాగ్‌లా మారి, వైసీపీ క్యాడర్‌కే చిరాకొచ్చేస్తోంది.
