Home » ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు.! ఇదొక పబ్లిసిటీ స్టంటు.!

ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు.! ఇదొక పబ్లిసిటీ స్టంటు.!

by hellomudra
0 comments
Prakash Raj

Prakash Raj Voter SIR.. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతోంది.! ఓటు హక్కు వున్నవాళ్ళు, తమ వివరాల్ని ప్రత్యేక పత్రంలో నమోదు చేయాల్సి వుంటుంది.

అలా ఎవరైతే, ఆయా పత్రాల్లో వివరాల్ని సమర్పించరో, వారికి ఇంకో అవకాశం కల్పిస్తారు. ఎవరి ఓటునీ తీసేయడం జరగదు ‘సర్’ ప్రక్రియ ద్వారా.

ఓ వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి వుంటే, ఆ అదనపు ఓట్లను తొలగిస్తారు. మరణించిన వారి ఓట్లు తొలగించబడతాయి. ఇదీ ‘సర్’ ఉద్దేశ్యం.

సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీద గతంలోనే కేసులున్నాయి ఓటు హక్కు విషయమై. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి వున్నాడన్నది ప్రకాష్ రాజ్ మీద ఆరోపణ.

అన్నట్టు, ప్రకాష్ రాజ్ గతంలో బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

తాను బెంగళూరు వాసిననీ, తన ఓటుని ‘సర్’ ప్రక్రియ ద్వారా తొలగించారనీ ప్రకాష్ రాజ్ ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది.

నిజానికి, ‘సర్’ ప్రక్రియ ద్వారా సమర్పించే పత్రానికి సంబంధించి, ఓ కాపీ.. ఓటరు వద్ద కూడా వుంటుంది. ఇంకో పత్రం, బూత్ లెవల్ ఆఫీసర్ వద్ద వుంటుంది.

అలా బీఎల్‌వోల దగ్గరకు చేరిన పత్రాల్ని డిజిటలైజ్ చేస్తారు. ఫైనల్‌గా, ఓటరు లిస్టుని విడుదల చేస్తారు. అందులో ఓటు హక్కు వుందో, పోయిందో తెలుసుకోవచ్చు.

ఒకవేళ ఓటు హక్కు కోల్పోతే, తిరిగి అభ్యర్థించే అవకాశం కల్పిస్తారు కూడా. ఇంతకీ, ప్రకాష్ రాజ్ ‘సర్’ ప్రక్రియలో పాల్గొన్నారా.? లేదా.? పాల్గొని వుంటే, సంబంధిత పత్రాన్ని వీడియోలో ఆయన చూపించేవారే.

గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా వేదికగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.. అనవసర రాద్ధాంతాలు ఆయనకు అలవాటైపోయాయి.

ఇప్పుడీ ‘సర్’ విషయంలోనూ ప్రకాష్ రాజ్ చేస్తున్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ అనే అనుకోవాలేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group