Toxic Vulgarity Yash Clarity.. కన్నడ హీరో యష్ తాజా చిత్రం ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యింది.
‘టాక్సిక్’ సినిమాలో హింస, అశ్లీలత హద్దులు దాటి వుంటాయని సినిమా ప్రమోషనల్ కంటెంట్ చెప్పకనే చెబుతోంది.
ఈ సినిమాకి దర్శకత్వం వహించింది మహిళ అయినప్పటికీ, అశ్లీలత విషయంలో అస్సలేమాత్రం తగ్గలేదు. అయితే, అది రెండు పాత్రల మధ్య రొమాన్స్ మాత్రమేనని అంటున్నాడు దర్శకుడు యష్.
యష్, కైరా అద్వానీ సహా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. వివిధ కారణాలో విడుదల ఆలస్యమవుతూ వచ్చింది ‘టాక్సిక్’.!
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడిన యష్, తమ సినిమా పెద్దలకు మాత్రమేనని తేల్చి చెప్పాడు. పిల్లలు ఈ సినిమాని చూడకూడదనీ స్పష్టం చేశాడు.
‘పెద్దవాళ్ళకు మాత్రమే మా సినిమా. అందులోని భావోద్వేగాల్ని వారు అర్థం చేసుకోగలరు. సినిమాపై వివాదాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని యష్ చెప్పుకొచ్చాడు.
ఈ మధ్యకాలంలో, చాలావరకు ‘పెద్దలకు మాత్రమే’ సినిమాలు వస్తున్నాయ్. మొన్నటికి మొన్న హింస, రక్తపాతం కోణంలో ‘ఓజీ’ సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ సినిమాని 18 ఏళ్ళ లోపు పిల్లలు చూడ్డానికి వీల్లేకుండా పోయింది మల్టీప్లెక్సుల్లో. ఓటీటీలోకి ఈ సినిమా అందుబాటులోకి ఆ తర్వాత వచ్చేసిందనుకోండి.. అది వేరే సంగతి.
‘ఓజీ’ ప్రస్తావన సంగతి పక్కన పెడితే, ‘టాక్సిక్’లో వల్గర్ కంటెంట్ పీక్స్‌లో వుందన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలోనే కైరా అద్వానీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే, కైరా అద్వానీకి బాసటగా నిలిచాడు హీరో యష్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్, తాను తెరకెక్కించాలనుకున్న కథని అద్భుతంగా తెరకెక్కించిందని యష్ చెప్పాడు.
ఏదిఏమైనా, సినిమా అంటే అందర్నీ అలరించేది. ‘పెద్దలకు మాత్రమే’ అని ప్రకటించడం, ‘చిన్న పిల్లలు చూడొద్దు’ అని చెప్పడం.. సినీ ప్రముఖులకు మంచిది కాదు.
హింస, రక్తపాతం, అశ్లీలత.. ఇవి లేకుండా కథలు చెప్పలేమన్న స్థాయికి దర్శక నిర్మాతలు, నటీనటులు వెళ్ళిపోవడం శోచనీయం.
