Home » అనసూయ ప్రశ్న: బొట్టు, గాజులు, పూలు.. భర్తతోనే వెళ్ళిపోవాలా.?

అనసూయ ప్రశ్న: బొట్టు, గాజులు, పూలు.. భర్తతోనే వెళ్ళిపోవాలా.?

by hellomudra
0 comments
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj Engagement Farming.. అసలు అనసూయ భరద్వాజ్‌కి ఏమయ్యింది.? మొన్నేమో ‘జై శ్రీరామ్’ నినాదంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

తాజాగా, భర్తతోనే పూలు, గాజులు, బొట్టు మాయమైపోవాలా మహిళకి.. అంటూ, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రశ్న లేవనెత్తింది.!

ఇదంతా, కేవలం రీచ్ కోసమే అనసూయ చేస్తోందా.? ‘నేను సెలబ్రిటీని.. నా మీద కామెంట్లు చేస్తే, రీచ్ వస్తుందని, నా మీద జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు’ అని అనసూయ ఎందుకు అంటోంది.?

ఔను, ఇప్పుడంతా ఎంగేజ్మెంట్ వ్యవసాయమే చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అనసూయ భరద్వాజ్ కూడా ఆ వ్యవసాయమే చేస్తున్నట్లుంది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

నిజమే, భర్త చనిపోతే భార్యకి పూలు, గాజులు, బొట్టు.. దూరమయ్యేవి. అది ఒకప్పటి వ్యవహారం.! అసలిప్పుడు నుదుటున బొట్టు ఎంతమంది ఆడపిల్లలు పెట్టుకుంటున్నారు.?

పువ్వులు పెట్టుకునే అమ్మాయిలు రోడ్ల మీద కనిపిస్తున్నారా.? గాజుల సంగతి సరే సరి.. మోడ్రన్ వస్తువులు ఏవో చేతికి తగిలించుకుంటున్నారంతే.

ఇక్కడ ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు.! ఎందుకంటే, ఎవరిష్టం వాళ్ళది. ఒకప్పటి పరిస్థితులు వేరు. భర్త చనిపోతే, ‘తెల్ల చీర’ తప్పనిసరయ్యేది మహిళలకి.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఇప్పుడు ఆ రోజులు లేవు.! నేటి మహిళ దేన్నీ దూరం చేసుకోవడంలేదు. రెండో పెళ్ళి, మూడో పెళ్ళి.. అవసరమైతే, నాలుగో పెళ్ళి, ఐదో పెళ్లి కూడా చేసుకుంటున్న రోజులివి.

అనసూయ భరద్వాజ్‌కి ఇవన్నీ తెలియదా.? ఆమె గృహిణి. ఇద్దరు మగ పిల్లలు ఆమెకి. భర్త కూడా వున్నారు. కానీ, అనసూయ అన్ని సందర్భాల్లోనూ బొట్టు, పూలు, గాజులు వేసుకునే బయటకు వస్తుందా.?

లేదు కదా.! ఫ్యాషన్ స్టైలింగ్.. తప్పదు. అనసూయ ఓ సెలబ్రిటీ. సినిమాలు.. ఆ హంగామా.. అది వేరే ప్రపంచం.! మారాయి.. అన్నీ మారిపోయాయ్.!

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

భర్త బతికే వున్నా.. కొందరు మహిళలు బొట్టు, గాజులు, పువ్వుల జోలికి వెళ్ళడం లేదు. భర్త చనిపోయిన మహిళలల్లోనూ కొందరు వాటిని అస్సలు వదులుకోవడం లేదు.

ఊరికే ఎంగేజ్మెంట్ వ్యవసాయం చేసింది అనసూయ భరద్వాజ్. ఆమె వ్యూహం ఫలించింది.. బోల్డన్ని తిట్లు వచ్చాయ్.! అయితేనేం, తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేయగలిగింది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group