Raviteja Irumudi Case Study.. రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి ఏకైక స్టార్ వాల్యూ అంటే, అది మాస్ మహరాజ్ రవితేజ మాత్రమే.!
సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్‌లో సీనియర నటుడు అజయ్ ఘోష్ సహా, రవితేజ కూడా ఒకింత బోర్డర్ దాటేసి, బూతులు మాట్లాడేశారు.
కుమార్తెగా నటించిన బేబీ నక్షత్ర మీద ‘దారుణమైన కామెంట్’ రవితేజ చేసేయడం వివాదాస్పదమయ్యింది. ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
‘ఇరుముడి’ ఫస్ట్ లుక్, అయ్యప్పస్వామి భక్తుల్ని ఆకట్టుకుంది. ఆ అయ్యప్ప స్వామి భక్తులు, ‘ఇరుముడి’ సినిమా విడుదలయ్యాక, థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు.
ఫస్ట్ డే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.. ఆ ఫ్యామిలీ ఆడియన్సే సినిమాకి బ్రహ్మరథం పట్టేస్తున్నారు.
నిజానికి, ‘ఇరుముడి’ సినిమాని ఓ కేస్ స్టడీగా చూడాలిప్పుడు.! ఎందుకంటే, ఈ మధ్యకాలంలో ఏ సినిమాకీ రానంతలా ‘స్ట్రెయిట్ పాజిటివ్ టాక్’ ఇరుముడి సినిమాకి వచ్చింది.
ఎక్కడా ఒక్క చోట కూడా నెగెటివ్ రివ్యూలు కనిపించలేదంటే, ఖచ్చితంగా ఇదొక కేస్ స్టడీ కిందనే భావించాలి. రివ్యూల్ని మేనేజ్ చేశారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
సోషల్ మీడియాలో ఎక్కడా నెగెటివిటీ రాకపోవడమూ ఆశ్చర్యకరమే. కారణం ఏదైతేనేం, ‘ఇరుముడి’ సినిమాకి అన్నీ కలిసొచ్చాయ్.
ఓటీటీలో ప్రకటనలు ఎక్కువైపోవడం సహా అనేక కారణాలు, ‘ఇరుముడి’కి అడ్వాంటేజ్‌గా మారాయి. థియేటర్లకు ప్రేక్షకులు ఇష్టంగా వెళ్ళడం.. ఇటీవలి కాలంలో ‘ఇరుముడి’ విషయంలోనే జరిగిందనొచ్చేమో.
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో అదరగొడితే, మధ్యలో చిన్న బ్రేక్.. ఆ తర్వాత ‘పెద్ది’ నెగెటివిటీ మధ్య కూడా హిట్టయ్యింది.
‘లెనిన్’ సినిమాకి కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చింది.. హిట్టయ్యింది. ‘కొరియన్ కనకరాజు’ కూడా క్లీన్ హిట్ అనిపించుకుంది. ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా హిట్టు బొమ్మే.
టిక్కెట్ల ధరల్ని కొన్ని సినిమాలకు తగ్గించడం కూడా, థియేటర్ల వైపు ప్రేక్షకులు వెళ్ళడానికి ఓ కారణంగా కొందరు చెబుతున్నారు.
మొత్తమ్మీద, తెలుగు సినిమాకి మళ్ళీ మంచి రోజులు వచ్చేలానే కనిపిస్తున్నాయి. నేల విడిచి సాము చేసే కథల్ని కాస్త పక్కన పెట్టి, ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించే కథల మీద ఫోకస్ పెడితే మంచిది.
అన్నట్టు, రవితేజ కూడా ఇకపై తానెలాంటి సినిమాలు చేయాలన్నది ‘ఇరుముడి’ తర్వాత ఇంకాస్త జాగ్రత్తగా సమీక్షించుకోవడం మంచిది.
రవితేజ స్ట్రెంగ్త్ ఏంటన్నది ‘ఇరుముడి’ ప్రూవ్ చేసింది. నటుడిగా అతని పొటెన్షియాలిటీని అతనికి గుర్తు చేసిన సినిమా ‘ఇరుముడి’.!
ఇలా చాలా అంశాలు, ‘ఇరుముడి’ సినిమాని ఓ కేస్ స్టడీగా మార్చేశాయి.!
