Home » పెళ్ళి.! జరగాలి మళ్ళీ మళ్ళీ.! ఇదొక నయా ట్రెండ్.!

పెళ్ళి.! జరగాలి మళ్ళీ మళ్ళీ.! ఇదొక నయా ట్రెండ్.!

by hellomudra
0 comments
Wedding Again

Wedding Again New Trend.. పెళ్ళంటే.! ఏడడుగులు.. మూడు ముళ్ళు..! ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వైవాహిక బంధంతో ఒక్కటవ్వడమంటే, అదో అద్భతమైన సందర్భం.

కానీ, ఆ పెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యనే మళ్ళీ మళ్ళీ జరిగితే.! ఒకింత వింతగా వుంది కదా.! ఏటా వెడ్డింగ్ యాన్సివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిన విషయమే.

షష్టి పూర్తి వేడుక సందర్భంగా, మళ్ళీ పెళ్ళి.. అనేది, కొందరికి మాత్రమే దక్కే భాగ్యం.! అదో పెద్ద తంతు మళ్ళీ.!

అయితే, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న వ్యవహారం వేరు.! ఎవరో సిద్ధాంతి చెప్పారని, అన్నవరం సత్య దేవుని సాక్షిగా కొన్ని జంటలు, ‘మళ్ళీ పెళ్ళి’ చేసుకున్నాయి.

వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు.. ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం, ‘మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోండి..’ అని ఆ జంటలకి ఓ సిద్దాంతి సూచించారట.

అంతే, అన్నవరం సత్య దేవుని సన్నిధిలో ‘పునర్వివాహానికి’ ఏర్పాట్లు చేసుకున్నారు.. భార్యా భర్తలే నూతన వధూవరులుగా మారారు.!

చిత్రమేంటంటే, ఈ జంటల పెళ్ళికి, వారి వారి పిల్లలూ, తక్కువ సంఖ్యలో ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారుట.!

ఇదేం వింత.? అని, ఈ ముచ్చట చూసినవాళ్ళంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు.

మళ్ళీ పెళ్ళి కొత్త అనుభూతినిచ్చిందని, ఆ జంటలు చెబుతుండడం గమనార్హం. చూసినవారి ముచ్చట సంగతి సరే సరి.!

వెర్రి అనుకోండి.. ఇంకోటేదన్నా అనుకోండి.. ఆ సంబరం మళ్ళీ.. అంటే, ఒకింత ప్రత్యేకమే.! కానీ, దైవ సన్నిధిలో ఇదేం పైత్యం.? అని పెదవి విరిచినవారూ లేకపోలేదు.

పెళ్ళి, విడాకులు, ఆపై మళ్ళీ పెళ్ళి.. మళ్ళీ విడాకులు.. మళ్ళీ మళ్ళీ పెళ్ళి.. ఇవన్నీ చూస్తూనే వున్నాం. ఒకే జంట, మళ్ళీ పెళ్ళి చేసుకోవడం.. ఇకపై నయా ట్రెండ్ అయ్యేలా వుంది.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group