MS Subbulakshmi Biopic Rashmika.. ఎంఎస్ సుబ్బులక్ష్మి ‘అమ్మ’ తెలుసు కదా.! ఆమెను ‘అమ్మ’ అనే పిలుస్తారు చాలామంది.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈమె గానంతోనే తెల్లారుతుంది.. వెంకటేశ్వర సుప్రబాతం ఈమె గానామృతంలో మరింత అద్భుతంగా మారింది మరి.!
దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలే కాదు.. భారతరత్న పురస్కారం కూడా ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ’ని వరించాయంటే, ఆమె ఖ్యాతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
అంతటి గొప్ప గాయని, దివంగత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నారు. నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్, అల్లు అరవింద్, బన్నీ వాసు.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని పట్టాలెక్కించారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి’ పాత్రలో రష్మిక మండన్న నటిస్తుండడం గమనార్హం.
MS Subbulakshmi Biopic Rashmika.. అప్పుడే విమర్శలు, ట్రోలింగ్ షురూ..
నాన్సెన్స్.. రష్మిక అంత గొప్ప వ్యక్తి జీవిత చరిత్రలో నటించడమేంటి.? అనే విమర్శలు సహజంగానే వినిపిస్తున్నాయి. రష్మికపై విపరీతంగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
అయితే, రష్మికకి ఏం తక్కువ.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. దర్శక నిర్మాతలు రష్మికనే బెస్ట్ ఛాయిస్‌గా ఎంచుకున్నారంటే, ఆమెలో ఏదో మ్యాజిక్ వుందనే కదా అర్థం.. అన్నది రష్మిక అభిమానుల వాదన.
ఏ సినిమా గురించిన వార్త బయటకు వచ్చినా, ఏదో ఒక రకంగా ట్రోలింగ్ జరగడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయంగా మారిపోయిన విషయం విదితమే.
రష్మి అంటే, నేషనల్ క్రష్.. నేషనల్ స్టార్.! నటిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిందామె. స్టార్‌డమ్ కోణంలో చూస్తే, కమర్షియల్ సినిమాలు ఎడా పెడా చేసుకోవచ్చు రష్మిక.
కానీ, నటిగా తన స్థాయిని మరింత పెంచుకోవాలన్న ఆలోచనో.. లేదంటే, విమర్శకుల ప్రశంసలు అందుకోవాలన్న తపనో.. ఈ తరహా కథల్ని కూడా రష్మిక ఎంచుకుంటోంది.
మొత్తమ్మీద, రష్మికకి ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ ఓ పెద్ద సవాల్ లాంటిదే.! సవాల్‌ని రష్మిక స్వీకరించింది.. ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి’ పాత్రలో రష్మిక మెప్పిస్తుందా.? వేచి చూడాల్సిందే.
రష్మిక గనుక ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ’ పాత్రలో మెప్పించిందంటే.. రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందనడం నిస్సందేహం. సినిమా రిజల్ట్ తేడా కొట్టిందంటే మాత్రం, ట్రోలింగ్ వేరే లెవల్‌లో జరుగుతుంది.
కాగా, ‘ఎంఎస్ సుబ్బులక్ష్మి’ సినిమా ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
