Thiruparankundram Deepam Joseph Vijay.. తిరుపరంకుండ్రం.. తమిళనాడులోని ఓ చిన్న పట్టణం.
తమిళనాడులోని ప్రముఖ మురుగన్ దేవాలయాల్లో ఒకటి ఈ తిరుపరంకుండ్రంలో కూడా వుంది.
ప్రతియేటా కార్తీక మాసం, పౌర్ణమి రోజున తిరుపరంకుండ్రంలోని మురుగన్ కొండపై ‘దీపాన్ని’ వెలిగిస్తారు. దీపమంటే, సాధారణ దీపం కాదు.. అఖండ జ్యోతి లాంటిదన్నమాట.!
కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలంలో ఎలాగైతేనే కొండ మీద పెద్ద దీపాన్ని వెలిగిస్తారో, ఇది కూడా అంతే. తమిళనాడులో చాలా దేవాలయాల్లో ఈ తరహా దీపోత్సవం జరుగుతుంటుంది.
కానీ, గత కొన్నేళ్ళుగా తిరుపరంకుండ్రంలో దీపోత్సవానికి సంబంధించి దుమారం చెలరేగుతోంది. కొండపై, ఆక్రమణల నేపథ్యంలో, దీపోత్సవానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
కొండ మీద ఓ మసీదు, ఈ దీపానికి ఇబ్బందికరంగా మారింది. ‘మనోభావాలు దెబ్బ తింటాయి.. మత ఘర్షణలు చెలరేగుతాయి..’ అంటూ, దీపోత్సవానికి ఆటంకాలు కలిగిస్తున్నారు.
చిత్రంగా, తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ దీపోత్సవానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. తాజాగా, న్యాయస్థానం దీపోత్సవానికి అనుకూలంగా తీర్పునిచ్చినా, ప్రభుత్వం ఆ ఆదేశాల్ని పక్కన పెట్టింది.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, దీపోత్సవం జరిగింది.. కానీ, జరగాల్సిన చోట జరగలేదు. పైన ఫొటోలో చూస్తున్నారు కదా.. ఇక్కడే దీపోత్సవం జరగాలి. కానీ, జరగలేదు.
పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దీపోత్సవానికి తరలి వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా, దీపోత్సవం సంప్రదాయబద్ధంగా జరుగుతుందని అంతా అనుకున్నారు.
కానీ, సుప్రీంకోర్టు తీర్పుని సైతం లెక్క చేయకుండా తమిళనాడు ప్రభుత్వం, దీపోత్సవం జరిగే, ప్రదేశాన్ని మార్చింది. దాంతో, భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఈ మొత్తం వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ వ్యతిరేకంగా తమిళనాడులో హిందువులు గళమెత్తుతున్నారు. యావత్ భారత దేశంలోని హిందువులంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి వచ్చారు.
అయోధ్య రామ మందిరం తరహాలో ఉద్యమిస్తే తప్ప, తిరుపరంకుండ్రంలో దీపోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం లేదన్న చర్చ అంతటా నడుస్తోంది.
అసలెందుకు, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఇలా చేస్తున్నాడన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. జన్మతః క్రిస్టియన్ అయినా, ఎన్నికల సమయంలో హిందూ దేవాలయాల చుట్టూ తిరిగాడు విజయ్.
అధికార పీఠమెక్కాక, ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు తీర్పుని సైతం లెక్క చేయకుండా హిందువుల మనోభావాల్ని జోసెఫ్ విజయ్ దెబ్బ తీసిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేసింది.