Tirumala Venkateswara Swamy Gold.. కలియుగ ప్రత్యక్ష దైవం.. అని, శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం.!
జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండపై వేంచేసిన, శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.
జీవితంలో ఒక్కసారైనా.. అనే ఒకప్పటి కోరిక, ఇప్పుడు వీలైతే నెలకోసారి, కుదిరితే వారానికోసారి.. అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.!

బస్సులు, రైళ్ళు, విమానాలు.. ఏవీ ఖాళీ వుండవు తిరుపతి వైపు.! ఎప్పుడూ రద్దీనే ఈ మార్గంలో. భక్తులు ఎక్కువవుతున్నారు.. భక్తులు సమర్పిస్తున్న కానుకలూ ఎక్కువవుతున్నాయి.
ముడుపులు కడతాం.. నిలువు దోపిడీ ఇస్తాం. వెంకన్న మీద భక్తి అలాంటిది. నిలువు దోపిడీ అంటే, శరీరం మీదున్న బంగారం మొత్తం, హుండీలో వేసేసేంత భక్తి.
Tirumala Venkateswara Swamy Gold.. వడ్డీకాసులవాడే.. కానీ, అత్యంత ధనవంతుడు..
ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన దేవుడు ఈ వడ్డీకాసులవాడు.! ఆయనా కుబేరుడి అప్పు తీర్చడానికి నానా తంటాలూ పడుతుంటాడనుకోండి.. అది వేరే సంగతి.
తాజాగా, తిరుమలేశుడికి 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాల్ని చెన్నైకి చెందిన భక్తుకొడకరు సమర్పించారు.

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి చేతుల మీదుగా ఈ మహత్కార్యం జరిగింది. తొలుత అజ్ఞాత భక్తుడి కానుక.. అంటూ ప్రచారం జరిగింది.
కానీ, సదరు భక్తుడి పేరు, ఆయన కుటుంబం చేస్తున్న వ్యాపారాలు.. ఇవన్నీ బయటకు వచ్చాయనుకోండి.. అది వేరే సంగతి.!
అసలు దేవాలయాలకు ఎందుకు భక్తులు విరాళాలు, కానుకలు ఇస్తారు.? అంటే, కోరిన కోరికలు నెరవేర్చే దేవదేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.? అంటాం భక్తులం.

ఇక్కడా అదే జరుగుతోంది.! రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి, శ్రీవారికి బంగారు ఆభరణాల్ని చేయించారంటే, సదరు చెన్నై వ్యాపార వేత్త ఎంత పెద్ద కోరికని ఆ దేవదేవుడి దయతో నెరవేర్చుకుని వుంటారు.?
శ్రీవారికి ఇలా విరాళాలు, కానుకలు సమర్పించే భక్తులకు తిరుమలలో ప్రత్యేక సౌకర్యాల్ని టీటీడీ కల్పిస్తోంది. చేసిన విరాళం, ఇచ్చిన కానుకల్ని బట్టి, ఆ సౌకర్యాల్లో తేడాలుంటాయి.

వెంకటేశ్వర స్వామికి ‘సేవ’ చేసే అవకాశాన్ని మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటి సేవ, ఇంకాస్త ‘ప్రత్యేకంగా’ చేసే అవకాశం దొరికితే.? ఆ అవకాశం కోసమే ఈ భారీ కానుకలు.
నిత్యాన్నదానం సహా, టీటీడీ భక్తుల కోసం చాలా చాలా మంచి పనులు చేస్తోంది. ఆసుపత్రుల్నీ నిర్వహిస్తోంది.! వాటన్నిటికీ, ఇదిగో భక్తులిచ్చే విరాళాలు, కానుకలు ఉపయోగపడుతుంటాయి.
Also Read: ఎల్లోరా కైలాస మందిరం: పై నుంచి కిందికి ఇదెలా సాధ్యమైందో.!
ఇక్కడ మనం చూస్తున్నవనీ, సదరు భక్తుడు, స్వామివారికి భక్తితో సమర్పించుకున్నవే. వీటి మొత్తం బరువు 121 కిలోలు. విలువ ముందే చెప్పుకున్నాం కదా.. దాదాపు 206 కోట్లు.
ఇవన్నీ చూశాక, ఆ వెంకటేశ్వరస్వామి భక్తులంతా తమ కళ్ళల్లో బంగారం నింపుకున్నట్లే ఆనందపడతారు మరి.!