Vijayadasami Bala Tripura Sundari.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ప్రతీ అలంకారానికి ఒక విశిష్టమైన పురాణ నేపథ్యం బలమైన తాత్విక అంతరార్ధాలు దాగి వుంటాయ్.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని, దశమి వరకూ పది రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల అలంకారాలతో అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.
వాటిలో మొదటి రోజు ‘బాల త్రిపుర సుందరి’ గా అమ్మవారు దర్శనమిస్తారు. ఎందుకు మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరించి పూజలు చేస్తారు.?
జీవిత ఘట్టంలో తొలి దశ బాల్యం. బాల్య దశలో చిన్న పిల్లల మనసు ఎంత నిష్కల్మషంగా, స్వచ్ఛంగా వుంటుందో తెలియజేసేందుకే ఈ అవతారం.
అమ్మవారికి తొలిరోజు బాల దశలో అంటే.. బాల త్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేకంగా పూజిస్తారు.
Vijayadasami Bala Tripura Sundari.. బాల త్రిపుర సుందరి – పురాణ గాధ
‘భండాసురుడు’ అనే రాక్షసుడ్ని పరాశక్తి సైన్యం యుద్ధం చేస్తున్నప్పుడు వారిని వధించే క్రమంలో అమ్మవారు ఈ అవతారమెత్తాల్సి వచ్చిందట.
భండాసురుడి 30 మంది కుమారులు అతని సైన్యంలో కలిసిపోయి దాడి చేస్తుండగా.. బాల రూపంలో అమ్మవారు వారితో యుద్ధం చేసి ఆ రాక్షస కుమారుల్ని సంహరించిందని పురాణ గాధ.
తొమ్మిదేళ్ల బాలగా ముగ్ధ మనోహర బాలికా రూపంతో అమ్మవారు ఈ అవతారంలో దర్శనమిస్తారు.
నాలుగు చేతులలో అక్షమాట, వేద పుస్తకం, అభయ మరియు వరద ముద్రలతో పద్మాసనంలో అమ్మ విరాజిల్లుతుంది.
బాల్య దశలో ఎటువంటి సాధన అయినా సాధ్యపడుతుంది.
నిష్కల్మషమైన బుద్ధి, ఏకాగ్రత, స్వచ్ఛమైన మనసుతో చేసే సాధన గుణం ఈ చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలని అమ్మవారి ఈ అవతారం సందేశమిస్తుంది.
అమ్మవారికి ప్రతిగా ఈ రోజు తొమ్మిదేళ్ల లోపు బాలికలను బాల త్రిపుర సుందరి రూపంలో చక్కగా అలంకరిస్తారు.
బాలా త్రిపుర సుందరిని, అమ్మవారి ప్రత్యేక ప్రతిరూపంగా భావించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం మన సాంప్రదాయంగా వస్తోంది.